జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొంగట్టు ఘాట్‌రోడ్డ వద్ద నిన్న ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించినవారికి  ఇవాళ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే భారీ వర్షం అంత్యక్రియలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.

ఉరుములు, ఈదురుగాలులతో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. దీంతో మృతుల బంధువులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం ప్రమాదం జరిగిన తరువాత మృతి చెందిన వారి మృతదేహలకు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.. అనంతరం వారి మృతదేహాలను బంధువలకు అప్పగించారు

మరణించినవారిలో రాంసాగర్, హిమ్మత్‌రావుపేట్, తిమ్మయ్యపల్లె, శనివారంపేట గ్రామాలకు చెందిన 40 మంది ఉన్నారు. వర్షం తెరిపినిస్తే అంత్యక్రియలు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. మంగళవారం రాంసాగర్ నుంచి శనివారంపేటకు 100 మందితో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్‌పై అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు.

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు విషాదం: ఐస్‌బాక్స్‌లో శవాన్ని పెట్టేందుకు డబ్బులు లేక.. ఐస్‌గడ్డలపై వరిపొట్టు పోసి

కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

కొండగట్టు బస్సు ప్రమాదం...మృతులు వీరే

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...