మహబూబాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే  ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లను సాధించినట్టేనని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ లో  శుక్రవారం నాడు నిర్వహించిన  సభలో ఆయన మాట్లాడారు.  కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి   హిందూ ముస్లింల బీమారీ ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత   రాష్ట్రంలో గిరిజనుల జనాభా పెరిగిందన్నారు.   రాష్ట్రం నుండి 17 ఎంపీలను  టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే  ఎస్టీ రిజర్వేషన్లు సాధించుకొన్నట్టేనని చెప్పారు.  టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే  కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లను సాధిస్తామన్నారు. 

ఎవరు గెలిస్తే ప్రజల తలరాత మారుతోందో ఆలోచించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే  తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామని  కాంగ్రెస్ పార్టీ నేత  మాజీ ఎంపీ  బలరామ్ నాయక్   మాట్లాడారని  కేసీఆర్ గుర్తు చేశారు. మనమే బలరామ్ నాయక్ ను పాకాలలో కలిపేద్దామన్నారు.  కేసీఆర్ సీఎం కాకుంటే మహబూబాబాద్ జిల్లా అయ్యేదా  అని ఆయన ప్రశ్నించారు.

గిరిజన తండాలను  గ్రామ పంచాయితీలుగా  గుర్తించినట్టు ఆయన తెలిపారు.  మళ్లీ లక్ష రూపాయాల రుణ మాఫీ చేస్తామన్నారు.   నాలుగున్నర  ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో  అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిన చరిత్ర  తమ ప్రభుత్వానిదని కేసీఆర్ గుర్తు చేశారు.  

ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో  తెలంగాణకు అన్యాయం  నిధులు ఇవ్వనని  చెప్పినా కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెరపలేదో  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్  మంచివాడని... ఆయనపై కొందరు గిట్టనివాళ్లు  తప్పుడు ప్రచారం చేశారని  కేసీఆర్  చెప్పారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ నేతల అవినీతిని కక్కిస్తాం: కేసీఆర్ హెచ్చరిక

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్