Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ నేతల అవినీతిని కక్కిస్తాం: కేసీఆర్ హెచ్చరిక

ఈ సారి అధికారంలోకి రాగానే  కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిని కక్కిస్తామని   టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెచ్చరించారు.

we committed to farmers welfare schemes says kcr
Author
Warangal, First Published Nov 23, 2018, 1:34 PM IST

 

నర్సంపేట: ఈ సారి అధికారంలోకి రాగానే  కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిని కక్కిస్తామని   టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెచ్చరించారు. ఈ నాలుగేళ్ల పాటు  రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రీకరించినట్టు చెప్పారు. కానీ, ఈ దఫా  అధికారంలోకి వస్తే  కాంగ్రెస్ నేతల అవినీతిని కక్కిస్తామన్నారు.

శుక్రవారంనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. హౌజింగ్ స్కీమ్‌లో కాంగ్రెస్ నేతలు  పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌజింగ్ మంత్రిగా ఉన్నాడని  ఆయన గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పి ఎందుకు చెప్పలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నిస్తున్నాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బిస్కట్లా...  అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ హయంలో ఒక్క ఇల్లు కట్టి 10 ఇళ్లను నిర్మించినట్టు లెక్కలు రాసినట్టు కేసీఆర్ ఆరోపించారు.  

తెలంగాణ స్వంత రాష్ట్రం అయినా కూడ చంద్రబాబునాయుడు  పాలన అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర నుండి చంద్రబాబునాయుడును అప్పుగా కాంగ్రెస్ నేతలు తీసుకొస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు సామాన్య మనిషా... ఆయన చమత్కరించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నిర్మాణం వద్దని  చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబును రాష్ట్రానికి తెచ్చిన కాంగ్రెస్ ను ఓడించాలని  కేసీఆర్ పిలుపునిచ్చారు. 

కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం రైతులకు పెట్టుబడి, ఉచిత కరెంట్ ఇస్తామని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి ఏది క్షేమమో ఆలోచించి వివేచనతో ఓటేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు.  నాయకులు వస్తుంటారు. పోతుంటారని చెప్పారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలో  రాష్ట్రం టాప్‌లో ఉందన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్  రాష్ట్రాన్ని సుమారు 58 ఏళ్ల పాటు పాలించారని ఆయన గుర్గు చేశారు. ఈ రెండు పార్టీల పాలనలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎలా ఉన్నాయనే దానిపై ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

గత ప్రభుత్వాలకు టీఆర్ఎస్ పాలనకు తేడా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబునాయుడును పంపించినా కూడ ఇంకా తాను పోనంటున్నాడని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

నాలుగేళ్ల పాలనలో  అనేక పథకాల అమల్లో రాష్ట్రం అనేక రంగాల్లో  నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అనేక అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా కూడ అమలు కావడం లేదన్నారు.  ఈ పథకం అమలు చేస్తున్నందుకు ఐక్యరాజ్యసమితి అభినందించిందన్నారు.

దళిత, గిరిజనుల కోసం అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లోనే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బిస్కట్లా... అంటూ కేసీఆర్  విమర్శించారు.

సంబంధిత వార్తలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios