దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె హత్యకు కారకులైన నిందితులను బహిరంగా ఉరితీయాలంటూ... ప్రజలు తీవ్ర ఆందోళనలు కూడా చేపట్టారు. కాగా.. శుక్రవారం ఉదయం పోలీసులు నిందితులను సీన్ రికన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లగా... నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

కాగా... నిందితులను చంపడం పట్ల..వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ బిడ్డలను చంపేశారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు  బంధువు అయితే... దిశను కించపరుస్తూ మాట్లాడటం గమనార్హం.

‘‘ ఎట్ల చంపుతారు. ఎవరిని అడిగి చంపుతారు. వాళ్లను రిమాండ్ లో ఉంచుతామని అన్నరు. మరి మళ్లీ ఎలా చంపారు. కోర్టుకు తీసుకపోలేదు. నేరం రుజువు కాలేదు.. కావాలనే చంపారు. ఇప్పుడు మా బిడ్డను మాకు తీసుకురండి. ఎవరిని అడిగి చంపిరు.. మమ్మల్ని అడిగిర్రా.. వాడి పెండ్లాన్ని అడిగిర్రా.. అన్యాయంగా చంపిర్రు. ఇంత మందిలో మా బిడ్డలు మాత్రమే రేపులు చేశారా..? రేప్ లు చేసిన వాళ్లు వందల మంది ఉన్నారు. వాళ్లందరినీ ఎందుకు శిక్షించలేదు. నేరాలు చేసి జైల్లో ఎంతమంది తింటలేరు. నీ నలుగురినే ఎలా చంపుతారు. ఎవరికీ తెలీకుండా రాత్రి మూడు గంటలప్పుడు కావాలని చంపారు. నా పిలగాళ్లను నాకు తెచ్చివచ్చండి. ఆ పిల్ల ముఖం చూడండి. ఏడు నెలల కడుపుతో ఉంది. ఆమెకు ఏం చెప్తారు.’’ అంటూ పోలీసులపై మండిపడ్డారు.

దిశను ఉద్దేశించి.. ఆ ల... ఎట్టాగూ చచ్చింది... అందుకని మా బిడ్డలను చంపుతారా అంటూ చాలా దారుణంగా మాట్లాడటం గమనార్హం. తెలుగు మీడియా ఛానెళ్లతో వీరు ఇలా మాట్లాడగా.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.