Asianet News TeluguAsianet News Telugu

అమ్నీషియా పబ్ రేప్ కేసులో సంచలన విషయాలు.. కార్లలో కండోమ్‌ ప్యాకెట్స్.. అత్యాచారం చేయాలనే ఉద్దేశంతోనే..!

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ వద్ద నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. 

Jubilee Hills gang rape is pre planned and accused used condoms says reports
Author
First Published Jun 13, 2022, 9:35 AM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ వద్ద నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. నలుగురు మైనర్లు, ఒక మేజర్ ప్రణాళిక ప్రకారమే నేరానికి పాల్పడ్డారని హైదరాబాద్ పోలీసులు వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. నిందితులు  వినియోగించిన ఇన్నోవా, బెంజ్ కార్లలో పోలీసులు కండోమ్‌లు గుర్తించినట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో నిందితులు కండోమ్‌లు వినియోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే వారు కండోమ్‌లను ఎక్కడి నుంచి పొందారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పినట్టుగా మీడియా రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

ఇక, ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా.. అందులో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. అయితే ఒక మైనర్ మాత్రం బాలికపై అత్యాచారానికి పాల్పడలేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుగుతన్నారు. ఆదివారం రోజున ఆరుగురు నిందితులతో పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితులను నేరం జరిగిన రోడ్డు నెంబర్ 44కు తీసుకెళ్లారు. నేరానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.ఇక,  బాధితురాలు స్నేహపూర్వక వైఖరిని ఉపయోగించుకుని లైంగిక దాడి చేసినట్టుగా నిందితులు అంగీకరించినట్లు తెలిసింది. 

Also Read: మూడో రోజు ముగిసిన నిందితుల కస్టడీ.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ , కీలక వివరాలు వెలుగులోకి

అయితే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కొన్ని తేడాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. కాల్ రికార్డుల ఆధారంగా మేము వారిని మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని ఆ వర్గా పేర్కొన్నాయి. నిందితులందరి కాల్ డేటా రికార్డ్స్‌ను క్రోడికరించిన పోలీసులు.. సోమవారం వాటి ఆధారంగా మరింతగా ప్రశ్నించనున్నారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా  ఉన్న సాదుద్దీన్ కస్టడీ నిన్నటితో ముగిసింది. మరోవైపు మైనర్లను పోలీసులు ఈరోజు కూడా విచారించనున్నారు. ఇదిలా ఉంటే ఐదుగురు నిందితులకు.. ఇటీవల ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పొటెన్సీ టెస్టులు చేయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌లు రావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి నిందితుల పొటెన్సీ టెస్ట్‌ల రిపోర్ట్.. ప్రధానమైన శాస్త్రీయ నివేదిక అని పోలీసులు భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios