Telangana Cabinet: 18 న రేవంత్ కేబినేట్ భేటీ.. చర్చించే కీలక విషయాలివే.. !
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతూండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న క్యాబినేట్ భేటీని నిర్వహించనున్నారు. ఈలోగా పలు కీలక నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఆ అంశాలేంటీ? ఏ అంశాలను చర్చించనున్నారనేది చర్చనీయంగా మారింది.
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానునడటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 18న కేబినేట్ భేటీ కానున్నారు. ఈ భేటీ ప్రధానంగా..తెలంగాణ, ఏపీ మధ్య పరిష్కారం కాని అంశాలపై సీఎం రేవంత్ సమీక్షించారు.
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ సంబంధించిన అన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఉద్యోగులు బదిలీ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యాత్మకంగా మారిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
వాస్తవానికి షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు అప్పుల విభజన, ఇప్పటివరకు పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న అంశాలు తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులు సీఎం ఆదేశించారు.
ఇకపై హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదని, ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ రెండు తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే.. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రానున్న ఖరీదు పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం నిర్ణయించారు.