Asianet News TeluguAsianet News Telugu

కల్కిలో పవర్ ఫుల్ గా కీర్తి సురేష్ పాత్ర, కానీ ట్విస్ట్..ప్రభాస్ డైలాగ్ విన్నారా, ఇదిగో వీడియో

కల్కి చిత్ర యూనిట్ మరో ఆసక్తికరమైన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో చూస్తే కల్కి చిత్రం ఎంత భారీగా.. టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ భాగం కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. 

Interesting video from kalki 2898 AD with Keerthy Suresh voice dtr
Author
First Published May 18, 2024, 10:20 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD చిత్రాన్ని నాగ అశ్విన్ మహాభారతంతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 500 కోట్లకి పైగా బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ఇంకా చాలా మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండబోతోంది. అమితాబ్ బచ్చన్ ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వథామ గా అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు కల్కి చిత్ర యూనిట్ మరో ఆసక్తికరమైన వీడియో రిలీజ్ చేసింది. 

ఈ వీడియో చూస్తే కల్కి చిత్రం ఎంత భారీగా.. టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ భాగం కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మళ్ళీ కీర్తి సురేష్ ఏంటి అని అంతా అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ ఈ మూవీలో డైరెక్ట్ గా నటించడం లేదు. 

కల్కి చిత్రంలో బుజ్జి అనే హైలీ స్మార్ట్ అండ్ పవర్ ఫుల్ వెహికల్ భాగం కాబోతోంది. కథలో భాగంగా ప్రభాస్ తన వాహనంగా ఈ వెహికల్ ని ఉపయోగించబోతున్నాడు. ఈ వెహికల్ కి వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఎవరిదో కాదు.. కీర్తి సురేష్ దే. చాలా ముద్దు ముద్దుగా ఈ వెహికల్ కి కీర్తి సురేష్ వాయిస్ ఇస్తోంది. 

ఈ వెహికల్ ని తయారు చేసే వీడియోని చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఈ వెహికల్ ని డిజైన్ చేయడానికి కల్కి టీం ఎంతలా కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. నాకు బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదు అని బుజ్జి బాధపడుతూ ఉంటుంది. నా బాడీని త్వరగా తయారు చేయండి రా అంటూ చిత్ర యూనిట్ ని తొదరపెట్టడం క్యూట్ గా ఉంది. 

 

నేను జీవితాంతం బాడీ లేకుండా బతికేయాల్సిందే ఏమో అంటూ బాధపడుతూ ఉండగా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి.. అంటూ ప్రభాస్ క్రేజీ డైలాగ్ చెప్పాడు. ఆ వెహికల్ ఎలా ఉంటుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాలి. బుజ్జి వెహికల్ ని రివీల్ చేసే టీజర్ మే 22న రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియోలో అనౌన్స్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios