RCB vs CSK : చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద.. విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
Virat Kohli IPL Records : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఒక వేదికపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మరో ఘనత సాధించాడు.
RCB vs CSK : రన్ మిషన్ విరాట్ కోహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్న కింగ్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్ లో ఒక వేదికపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శనివారం బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 68వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎం.చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2024 లో ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ తరఫున దూకుడుగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్. ఈ ఇన్నింగ్స్ లో సిక్స్‌తో 13 పరుగులకు చేరుకున్నప్పుడు కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ హిస్టారీలో మొత్తం 17 సీజన్లలో ఒక వేదికపై 3000 పరుగులు చేసిన మొదటి ఐపీఎల్ బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ లిస్టులో ఒక వేదికపై ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2295 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు.
చెత్త కెప్టెన్సీ.. చెత్త ఫామ్ తో ఐపీఎల్-2024 లో ముంబైని ముంచిన హార్దిక్ పాండ్యా..
ఏప్రిల్ 18, 2008న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ తరపున కోహ్లి తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ను ఆడాడు. 86 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ ఈ వేదికపై 22 అర్ధసెంచరీలు, నాలుగు సెంచరీ సాధించాడు. 113 అత్యధిక వ్యక్తిగత స్కోర్. కోహ్లీ ఈ గ్రౌండ్ లో 124 సిక్సర్లు బాదాడు. ఇదిలావుండగా, ప్రస్తుతం మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 47 పరుగుల తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అలాగే, ఐపీఎల్ లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాటర్ గా కూడా రికార్డు సృష్టించాడు కింగ్ కోహ్లీ.
ఏందిరా మావా ఇది.. ఆర్సీబీ ఇంట్లో సీఎస్కే రచ్చ.. షేక్ చేశారుగా.. !