డ్రగ్స్ కేసు.. మరో కీలక నిందితుడు బాలమురుగన్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..
హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికి చిక్కకుండా వ్యాపారం సాగిస్తున్న బాలమురుగన్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్‌తో కలిసి డ్రగ్స్ సరఫరా చేసిన మరో నిందితుడు బాలమురుగన్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఎవరికి చిక్కకుండా వ్యాపారం సాగిస్తున్న బాలమురుగన్‌ను ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. బాలమురుగన్.. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవాలోగా డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడు.
ఎడ్విన్ ఇచ్చిన సమాచారం మేరకు గోవాలో బాలమురుగన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బాల మురుగున్ 15 ఏళ్లుగా ఎడ్విన్‌తో కలిసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
హోటళ్ల కేంద్రంగా బాలమురుగన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హోటల్స్ బిజినెస్ పేరుతో బాలమురుగన్ ఈ దందా సాగిస్తున్నారు. అతని నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు రెండు వేల కస్టమర్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.