హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు తారా స్థాయికి చేరింది. నువ్వొకటంటే నేను వందంటా అన్న చందంగా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన రాజకీయ పోరుకు మరింత ఆజ్యం పోసినట్లైంది. టీర్ఎస్ పార్టీపై జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై ఇరు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. 

తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ. జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మీ అజ్ఞానానికి నిదర్శనమంటూ తిట్టిపోశారు. జేపీ నడ్డాపై కేటీఆర్ చేసిన విమర్శలకు బహిరంగ లేఖ రాశారు.  జేపీ నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమంటూ లేఖలో స్పష్టం చేశారు. 

కేటీఆర్ లా నడ్డా కార్పొరేట్ సంస్థల పెంపుడు నేత కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌, ఫార్మాసిటీ కోసం 2016లో నడ్డాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. 

టీఆర్‌ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాల పుట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బలపడుతుంటే టీఆర్‌ఎస్‌ నేతల్లో అసహనం పెరిగిపోతోందని లేఖలో పేర్కొన్నారు. అయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ గొప్పదైతే పేదలకు వైద్యం ఎందుకు అందడం లేదు? అని నిలదీశారు. ఆరోగ్యశ్రీతో పేదలు రోడ్లపై పడ్డారని విమర్శించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

జేపీ నడ్డాకు కేటీఆర్ సవాల్: మీనాన్న అనుమతి తీసుకున్నారా అంటూ విజయశాంతి సెటైర్లు

కర్ణాటక తరహా డ్రామాలు తెలంగాణలో సాగవు: బీజేపీపై కేటీఆర్

మెక్కిందంతా కక్కిస్తాం-నిగ్గు తేలుస్తాం, స్థాయి మరచి మాట్లాడకు: కేటీఆర్ కు బీజేపీ చీఫ్ వార్నింగ్

కర్ణాటక తరహా డ్రామాలు తెలంగాణలో సాగవు: బీజేపీపై కేటీఆర్

కార్యకర్తల గొంతు కోశారు, నన్ను అడ్డుకున్నారు : టీడీపీలో అవమానాలపై గరికపాటి కంటతడి

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది: జేపీ నడ్డా

తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు