హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని ఆదిశగా ప్రతీ ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. 

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ పదాధికారులతో సమావేశమైన జేపీ నడ్డా తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికలు, పార్టీలో చేరికలు, సమన్వయం వంటి అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నేతలు అనే వారు ఉండరని అంతా ఒక్కటేనని చెప్పుకొచ్చారు. అంతా ఏకమై పార్టీని బలోపేతం చేయాలని రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.  

పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై  నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేంద్రసహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావులతో పాటు పలువురు పాల్గొన్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు