తెలుగులో తన ప్రసంగాన్ని మెుదలుపెట్టగిన జేపీ నడ్డా సభకు హాజరైన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం మన పార్టీకి ఎల్లప్పుడు ఉంటుందని తనకు విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలాంటి పుణ్యభూమిపై తాను అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన తెలంగాణ గడ్డలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.
తెలుగులో తన ప్రసంగాన్ని మెుదలుపెట్టగిన జేపీ నడ్డా సభకు హాజరైన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం మన పార్టీకి ఎల్లప్పుడు ఉంటుందని తనకు విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలో 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఖాళీలు భర్తీ చేయాలని నిలదీస్తే తెలంగాణ ద్రోహులు అంటూ తమపై నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన 30 మంది కీలక నేతలకు కాషాయికండువా కప్పారు. దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించే సత్తా ఒక్క ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.
మోదీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే అనేక మంది నేతలు అనేక పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. మోదీ నేతృత్వంలో పనిచేసేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.
బీజేపీ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదన్నారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవన్నారు. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కూతురు ఇలాంటి కుటుంబ పాలన ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలా ప్రజలను ఓటు బ్యాంక్ గా చూడబోదన్నారు.
ఒకే దేశం-ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం అనే పేరుతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్ష అయిన జమ్ముకశ్మీర్ విభజన చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి
హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)
మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా
