ప్రణయ్ హత్య కుల దురహంకారానికి పరాకాష్టగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అభివర్ణించారు. మిర్యాలగూడ లో పరువు హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్ కుటుంబాన్ని ఆయన సందర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

మిర్యాలగుడా: ప్రణయ్ హత్య కుల దురహంకారానికి పరాకాష్టగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అభివర్ణించారు. మిర్యాలగూడ లో పరువు హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్ కుటుంబాన్ని ఆయన సందర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


దేశంలోనే పెను సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటన తమ హృదయం ను తీవ్రంగా కలచివేసిందని, సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఇటువంటి పాశవిక చర్యలకు పాల్పడం అనాగరికమని, కుల పైశాచికత్వనికి పరాకాష్టని, అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తెలంగాణలోనూ ఇటువంటి పాశవిక చర్యలను అందరూ ఖండించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినాతి కఠినంగా శిక్షించి, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అయన పోలీస్ అధికారులకు సూచించారు.

షాకుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హతుని భార్య అమృతను కూడా ఆయన పరామర్శించారు. కమిషన్ అండగా ఉంటుందని ఆయన ఆమెకు భరోసా కల్పించారు. ఆయనతో స్థానిక శాసనసభ్యులు శ్రీ భాస్కర రావు, కమిషన్ సభ్యులు శ్రీ బొయిళ్ల విద్యాసాగర్, శ్రీ యం రాంబల్ నాయక్, శ్రీ చిల్కమర్రి నరసింహ్మ, జిల్లా ఎస్పీ శ్రీ రంగనాథ్ ఉన్నారు.

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)