Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ సైట్లకు బానిసై మహిళలతో అసభ్య ప్రవర్తన... హైదరబాదీ యువకుడిపై పిడి యాక్ట్

పోర్న్ వీడియోలకు బానిసై మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిపై సైబరాబాద్ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసారు.

Cyberabad Police implimented PD Act on Young Boy
Author
Hyderabad, First Published Oct 15, 2021, 11:55 AM IST

హైదరాబాద్: మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అఘాయాత్యాలు మాత్రం ఆగడంలేదు. ఎక్కడో ఒకచోట మహిళలు కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. దీంతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు Telangana police. ఈ క్రమంలోనే మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఒకడిపై ఏకంగా పిడి యాక్ట్ నమోదు చేసారు Hyderabad పోలీసులు. 

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని మేడ్చర్ జిల్లా బృందావన్ కాలనీలోకి ఆనందపల్లి అపార్ట్ మెంట్ లో నివాసముండే ఆదిత్య బస్వరాజ్(25) అనే యువకుడు పోర్న్ సైట్లకు అలవాటుపడ్డాడు. నిత్యం పోర్న్ వీడియోలు చూడటమే కాదు అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అలాగే మార్ఫింగ్ ఫోటోలతో యువతులను వేధిస్తున్నాడు. అలాగే కాలనీలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

read more  అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన మహిళ

ఇటీవల ఓ మహిళపై ఆదిత్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా ఇతర మహిళలు, యువతులను కూడా అతడి వేధించినట్లు బయటపడింది. దీంతో ఆదిత్యను కఠినంగా శిక్షించాలని భావించిన సైబరాబాద్ కమీషనర్ స్టీపెన్ రవీంద్ర PD Act ప్రయోగించారు. కమీషనర్ ఆదేశాలతో ఆదిత్యపై సైబర్ క్రైమ్ పోలీసులు పిడి యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios