Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ చూస్తే.. రూ.5లక్షల ఫైన్

ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా చూస్తున్నావు, అందులో ప్రత్యేకంగా ఓ వయసు గల మహిళలపైనే వ్యామోహం పెంచుకున్నావ్. ఏంటి సంగతని అందులో వివరించారు. ఇది చదువుతున్న సుధాకర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. 

cyber crime officers warning people who are watching porn movies
Author
Hyderabad, First Published Aug 13, 2018, 9:59 AM IST

పోర్న్ మూవీస్ చూసే అలవాటు ఉందా మీకు..? అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక నుంచి  మీరు పోర్న్ చిత్రాలు చూస్తే.. లక్షల్లో ఫైన్ చెల్లించాల్సి వస్తుంది.  మేము పోర్న్ మూవీస్ చూసే విషయం ఎవరికీ తెలియదు కదా అని భ్రమపడిపోకండి. ఎందుకంటే మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు గమనిస్తూనే ఉన్నారు. 

అవును.. నిజం అశ్లీల వెబ్‌సైట్‌లను చూసే ప్రియులను ఇప్పుడు సైబర్ మాయగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. మీరు బ్రౌజ్ చేస్తున్న వెబ్‌సైట్ల నుంచి మీ సమాచారాన్ని మాల్‌వేర్స్ ద్వారా సేకరిస్తున్నారు. దీంతో మీ మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, ఇతర సమాచారాన్ని సేకరించి వాటి ద్వారా మిమ్మల్ని బెదిరించి మీ నీలిచిత్రాల వీక్షణాన్ని మీకే చూపించి డబ్బులు వసూలు చేసేందుకు సరికొత్త ఎక్స్‌టార్షన్‌కు శ్రీకారం చుట్టారు. 

ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌లకు చెందిన కొంత మంది యువకులు ఈ విధమైన బెదిరింపులు ఎదుర్కొని ఇబ్బందులుపడ్డారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ యువకులు పోలీసులను ఆశ్రయించి తమ బాధను వ్యక్తం చేశారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి ఎల్బీనగర్ డీసీపీ జోన్ ప్రాంతానికి చెందిన సుధాకర్(పేరుమార్చాం)కు ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. నీవు ఈ మధ్య ప్రతిరోజు నీలిచిత్రాల వెబ్‌సైట్లను బాగానే జల్లెడ పడుతున్నావు. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా చూస్తున్నావు, అందులో ప్రత్యేకంగా ఓ వయసు గల మహిళలపైనే వ్యామోహం పెంచుకున్నావ్. ఏంటి సంగతని అందులో వివరించారు. ఇది చదువుతున్న సుధాకర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. 

మిగతా మెయిల్ చదివి ఇది ఎవరో ఆటపట్టించడానికి చేసి ఉంటారని భావించి తేలికగా తీసిపాడేశాడు. మరో రోజు సుధాకర్‌కు నిజంగా అతను బ్రౌజ్ చేసిన కొన్ని వెబ్‌సైట్లలోని ఫొటోలు మెయిల్‌కు వచ్చాయి. దీంతో మరింతగా కలవరపడ్డాడు. ఏమి అర్థంకాలేదు.. టెన్షన్ పడ్డాడు. మరో రెండురోజుల తర్వాత మరో మెయిల్ వచ్చింది. నీవు మాకు రూ.ఐదు లక్షలు బిట్‌కాయిన్స్ (క్రిప్టో కరెన్సీ) కింద జమ చేయాలి. లేదంటే ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉన్న నీ ప్రతిష్టను దెబ్బతీస్తామని హెచ్చరించారు. 

నీవు బ్రౌజ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాతోపాటు నీ మెయిల్ కాంటాక్ట్స్‌లో ఉన్న స్నేహితులందరికి పంపిస్తామని హెచ్చరించారు. ఈమెయిల్‌తో మరింత ఆందోళనకు గురైన సుధాకర్ వెంటనే రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి మౌఖికంగా ఈ మెయిల్ తతంగంపై వివరించారు. పోలీసులు ఇలాంటి వారికి భయపడి డబ్బులు కట్టొద్దని సూచించారు. ఇలాంటి వెబ్‌సైట్లకు దూరంగా ఉంటేనే సురక్షితమని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios