తెలంగాణ లో కరోనా వైరస్ బారినపడ్డవారందరికీ ఇప్పుడు కేవలం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ కి మందు లేకపోవడంతో రోగి రోగ నిరోధశక్తిని పెంచడం ద్వారా ఈ వైరస్ బారి నుండి బయటపడేయాలిసుంటుంది. 

కాబట్టి ఇలా రోగులకు ఇచ్చే మందులతోపాటు బలవర్ధకమైన పౌష్టికాహారం ఇవ్వవలిసి ఉంటుంది. పండ్లు, డ్రై ఫ్రూప్ట్స్ తో సహా అవసరమైన పోష్టికాహారాన్ని రోగులకు అందించడం ద్వారా వారి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తున్నారు. 

ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు ఉదయం ఇడ్లి, దోస, చపాతీ, పాలు, టీ, బ్రెడ్ ఇస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనంలోకి అన్నం, 2 రకాల కూరలు, కోడి గుడ్డు, సాంబార్, పెరుగు అందిస్తున్నారు. సాయంత్రం పూత డ్రై ఫ్రూప్ట్స్, ఫ్రూప్ట్స్ ని అందిస్తున్నారు. ఇక రాత్రి డిన్నర్ లో అన్నం, చపాతీ, కూరలను ఇస్తున్నారు. వీటితోపాటు ప్రతి రోగికి రోజుకు నాలుగు మినరల్ వాటర్ బాటిళ్లను ఇస్తున్నారు. 

ఇక ఇది ఇలా ఉండగా, ఏపీ రాష్ట్రానికి చెందిన 36 మంది తెలంగాణలో క్వాంరటైన్ ముగించుకొని ఏపీ రాష్ట్ర సరిహద్దుకు గురువారం నాడు ఉదయం చేరుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని ఏపీ పోలీసులకు చూపారు. అయితే క్వారంటైన్ లో ఉంటామంటేనే ఏపీ అధికారులు వారికి అనుమతి ఇస్తామని తెగేసి చెప్పారు.

విదేశాల నుండి వచ్చిన వారిని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచింది. క్వారంటైన్ లో ఉంచిన సమయంలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాత సుమారు 258 మందిని ఇంటికి పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రెండు రోజుల క్రితం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Also read:కరోనా ఎఫెక్ట్: తిరుమల వీధుల్లో వన్యప్రాణుల సంచారం, 128 ఏళ్ల వాతావరణం

క్వారంటైన్ పూర్తి చేసుకొన్న వారిని వారి స్వస్థలాలకు తెలంగాణ ప్రభుత్వం పంపింది.  ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్రానికి చెందిన 36 మందిని ప్రత్యేక బస్సులో తెలంగాణ ప్రభుత్వం అనుమతి పత్రంతో పంపారు. గురువారం నాడు ఉదయం కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద ఏపీ పోలీసులు ఈ బస్సును ఆపారు. 

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాన్ని బస్సులోనివారు ఏపీ పోలీసులకు చూపారు. కానీ గంట తర్వాత ఏపీలో అడుగుపెట్టాలంటే మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు. క్వారంటైన్  పూర్తైన తర్వాతే వారిని స్వగ్రామాలకు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.