హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో ఆపార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఇటీవలే విజయశాంతి దుబ్బాక నియోజకవర్గం లేదా మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

అయితే మెుదటి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు, కార్యకర్తలు ఆమె వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో స్పందించిన రాములమ్మ తనకు సీటు కేటాయించలేదనడం అవాస్తవమని చెప్పారు. పార్టీ అధిష్టానం పోటీ చెయ్యాలని తనన కోరిందని అయితే స్టార్ కాంపైనర్ హోదాలో ఎన్నికల ప్రచార బాధ్యతలు తనపై ఉండటంతో తాను పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. 

అందులో పార్టీ తప్పేమీ లేదని రాములమ్మ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కేసీఆర్ ను గద్దె దించడమేనని చెప్పుకొచ్చారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా విడుదలైన తర్వాత ఆ పార్టీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇప్పటి వరకు మెుదటి జాబితా విడుదలైంది. రెండో జాబితా మంగళవారం రాత్రి మూడో జాబితా బుధవారం రాత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది.   

ఈ వార్తలు కూడా చదవండి

మామ అల్లుళ్ల మధ్య సీటు చిచ్చు, కొంపముంచుతానంటున్న అల్లుడు

ఆ సీటుకి కాంగ్రెస్ వేలం, తాను పాల్గొనలేదంటున్న మాజీ ఎమ్మెల్యే

దిగొచ్చిన సీపీఐ: మూడు సీట్లు, రెండు ఎమ్మెల్సీలకు సర్ధుబాటు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు