Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల కేంద్రంగా మార్చుతున్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చడానికి కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో సెన్సేషన్ రైస్ పేరుతో మ్యూజికల్ నైట్స్ కి అనుమతిచ్చారని తెలిపారు. మద్యం ఏరులై పారే ఈ పార్టీకి ముక్కుపచ్చలారని 15 ఏళ్ల పాఠశాల విద్యార్థులను కూడా అనుమతించడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు, సరఫరాదారుల కోసమే ఇలాంటి పార్టీలు నిర్వహిస్తుంటారని రేవంత్ వివరించారు. 

congress leader revanth reddy fires on kcr family
Author
Hyderabad, First Published Oct 27, 2018, 11:43 AM IST

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చడానికి కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో సెన్సేషన్ రైస్ పేరుతో మ్యూజికల్ నైట్స్ కి అనుమతిచ్చారని తెలిపారు. మద్యం ఏరులై పారే ఈ పార్టీకి ముక్కుపచ్చలారని 15 ఏళ్ల పాఠశాల విద్యార్థులను కూడా అనుమతించడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు, సరఫరాదారుల కోసమే ఇలాంటి పార్టీలు నిర్వహిస్తుంటారని రేవంత్ వివరించారు.

తెలంగాణ ప్రజల్ని, యువతను తాగుడికి, డ్రగ్స్ కి బానిస చేయాలని సీఎం భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దీంతో ప్రస్తుతం చైతన్యపరులుగా వుండి ప్రశ్నించే తత్వాన్ని కలిగిన ప్రజలను వ్యసనపరులుగా మార్చే కుట్ర జరుగుతోందని అన్నారు.  లేకుంటే యువతకు క్రీడా సౌకర్యం కల్పించడానికి నిర్మించిన స్టేడియంలో ఇలాంటి పార్టీలకు అనుమతించడం ఏంటని  రేవంత్ ప్రశ్నించారు.

దేశంలో గోవా, ముంబై వంటి ప్రాంతాల్లో నిషేదించిన మ్యూజికల్ నైట్స్ కు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతులు జారీ చేసిందని అన్నారు. గతంలో గోవా, పూణే, బెంగళూరు నగరాలు కూడా ఈ పార్టీలను అనుమతివ్వలేదని అన్నారు. గోవాలో అయితే ఏకంగా ఆ పార్టీల వల్ల యువత ప్రాణాలు కోల్పోయారని స్వయంగా ఆ రాష్ట్ర మంత్రే వెల్లడించారని రేవంత్ తెలిపారు. 
 
గతంలో సన్ బర్న్ పార్టీని ముందుండి నడిపిన  కేసీఆర్ కుటుంబం ఈ పార్టీ తెర వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈవెంట్స్ నౌ సంస్థ ద్వారా ఆన్ లైన్లో 10వేల వరకు టికెట్ల విక్రయిస్తుండగా, బైట మాత్రం దాదాపు లక్షన్నర నుండి ఐదు లక్షల వరకు విక్రయిస్తున్నారని అన్నారు. జీఎస్టీ ఎగ్గొట్టడానికే ఇలా చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి స్టేడియంలో ఈ సెన్సేషన్ రైస్ నిర్వహించడాని ఎన్నికల సంఘం నుండి అనుమతులు తీసుకోలేదని  అన్నారు. అలాగే నిబంధలకు విరుద్దంగా చిన్నారులకు అనుమతి కల్పిస్తున్న ఈ పార్టీని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పోలీసులతో ప్రత్యేక భద్రత మాత్రం ఏర్పాటుచేసిందని రేవంత్ ఆరోపించారు. 

 

మరిన్ని వార్తలు

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

Follow Us:
Download App:
  • android
  • ios