జబర్దస్త్ అంటేనే గలీజు పదాలకు, గలీజు మాటలకు పెట్టింది పేరు. ఆ షో చేసే యాంకర్ అనసూయ జబర్దస్త్ లో చేసినట్లే బయట చేసిందట. ఇంతకూ అంత పని అనసూయ ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి. వీడియో చూడండి.

నెంబర్ 1 బూతు షో గా తెలుగు టివి చిరిత్రలో రికార్డు సృష్టించిన జబర్దస్త్ యాంకర్ అనసూయ తార్నాకలో ఓవర్ యాక్షన్ చేసిందట. ఆమె తార్నాక వచ్చిన సందర్భంలో ఆమెను గుర్తు పట్టిన ఒక బాలుడు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన యాంకర్ అనసూయ ఆ బాలుడి చేతిలోంచి ఫోన్ గుంజుకుని కింద పడేసి పగలగొట్టిందట. అంతేకాదు గలీజ్ గలీజ్ మాటలు తిట్టిందట.

ఆ బాలుడిని తిట్టడంతో ఆ బాలుడి తల్లి అనసూయతో వాగ్వాదానికి దిగిందట. అంతేకాకుండా అనసూయపై ఆ బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనసూయ తీరుపై ఆ బాలుడి తల్లి ఏమంటున్నారో కింద వీడియోలో చూడండి.