హైదరాబాద్‌ : తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో డెంగీ, జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో వాటిపై ఆరా తీశారు. డెంగీ తీవ్రత, సీజనల్‌ వ్యాధుల పరిస్థితి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. 

 సీజనల్ వ్యాధుల పట్ల అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. జ్వరాలకు సంబంధించి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఎలాంటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. 

సీజనల్ వ్యాధుల బారినపడి ప్రజలకు తక్షణమే వైద్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు మరింత దగ్గర కావాలని సూచించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోపం రాకుండా చూసుకోవాలని సూచించారు. 

అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆస్పత్రులను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వైద్య సేవలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 

ప్రజలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్్చారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల ప్రభావం, అందుతున్న వైద్య సేవలను సీఎం కేసీఆర్ కు వివరించారు మంత్రి ఈటల రాజేందర్.  

సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తున్నారు. డెంగీ,సీజనల్ వ్యాధుల తీవ్రత నేపథ్యంలో ఆ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. 

విష జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ జ్వరం డెంగీ కాదన్నారు. ఈ సీజన్‌ జ్వరాల్లో 98శాతం విష జ్వరాలేనని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, విష జ్వరాల కేసుల వివరాలను ప్రతిరోజూ ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. 

పీహెచ్‌సీల్లోనే రోగాలను గుర్తించగలిగితే జిల్లా ఆస్పత్రులకు రోగుల తాకిడి తగ్గుతుందని సూచించారు. ఇకపోతే మహబూబాబాద్‌లో 300 పడకల ఆస్పత్రి కోసం రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 

హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా భద్రాద్రి ఏజెన్సీ ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందుతున్నాయంటూ కితాబిచ్చారు. అనంతరం భద్రాద్రి రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఈటల రాజేందర్.  
 
ఈటల పర్యటనలో టీఆర్ఎస్ నేతల నినాదాలు 

బుధవారం మంత్రి ఈటల రాజేందర్ పర్యటనలో కొందరు టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఇల్లెందులోని జగదాంబసెంటర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నేతలు గులాబీ జెండాకు మేమే ఓనర్లం అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఈటల రాజేందర్ మహబూబాబాద్ వెళ్లిపోయారు. 

ఈవార్తలు కూడా చదవండి

పెరుగుతున్న విషజ్వరాలు: సూర్యాపేట ఆసుపత్రిలో మంత్రుల తనిఖీ

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

​​​​​​​కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

 

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ