రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ...రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని.. రెండు నెలల పాటు సెలవులు పెట్టవద్దని ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బందిని ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు సైతం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈటల సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రతి జిల్లాలో మంత్రులు సమీక్షలు చేస్తున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఈటల తెలిపారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ అమేయ కుమార్ ఉన్నారు.