హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన సినీ నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

మద్యం మత్తులో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురి చేసినట్టుగా కార్తీక్ అనే వ్యక్తి శుక్రవారం నాడు ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు రాజ్ తరుణ్ ను విచారించారు. ఈ ప్రమాదానికి కారణమైన రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

కారు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ పై 279, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా డీసీపీ ప్రకటించారు. ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్టేట్ మెంట్ ను కూడ రికార్డ్ చేసినట్టుగా ఆయన వివరించారు.

రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నట్టుగా కార్తీక్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ కు దిగినట్టుగా రాజా రవీంద్ర కూడ ఫిర్యాదు చేసినట్టుగా డీసీపీ తెలిపారు.అయితే అరెస్టైన రాజ్ తరుణ్ బెయిల్ పై విడుదలైనట్టుగా సమాచారం.  

సంబంధిత వార్తలు

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదంపై పోలీసులు ట్విస్ట్

రాజ్ తరుణ్ ఎపిసోడ్.. కార్తిక్ పై క్రిమినల్ కేసులున్నాయని చెప్పిన రాజారవీంద్ర

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్