హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్  కారు ప్రమాదంపై  పోలీసులు విచారణను వేగవంతం చేశారు. రాజ్ తరుణ్ నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.మద్యం తాగి రాజ్ తరుణ్ ప్రమాదం చేశాడనేందుకు సరైన ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.

రాజ్ తరుణ్ ప్రమాదం జరిగిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై కార్తీక్ అనే వ్యక్తి వీడియోను బయటపెట్టడంతో పోలీసులు శుక్రవారం నాడు విచారణను ఆ దిశగా కూడ ప్రారంభించారు. సినీ నటుడు రాజ్ తరుణ్ కు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు

నార్సింగ్ పోలీసులు శుక్రవారం నాడు రాజ్ తరుణ్ నుండి వివరాలను సేకరించారు. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ ఇంటికి ఎలా వచ్చాడనే విషయాలపై పోలీసులు ఆరా తీసింది.

రాజ్ తరుణ్ మద్యం తాగి యాక్సిడెంట్ చేశాడని  చెప్పేందుకు సరైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన మరునాడే టెస్ట్ చేస్తే మద్యం  వల్లే ప్రమాదానికి కారణమైందా  అనే విషయమై స్పష్టత వచ్చేదని పోలీసులు చెబుతున్నారు.

ఈ నెల  20వ తేదీన రాజ్ తరుణ్ కారు నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలోని  అలకాపురి వద్ద  ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదానికి గురైన తర్వాత రాజ్ తరుణ్ పరుగెత్తుకొంటూ వెళ్లిపోయాడు.

అయితే మద్యం తాగి  కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికుడు కార్తీక్ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టాడు. అయితే కార్తీక్ ఈ వీడియోలతో రాజ్ తరుణ్ ను బ్లాక్ మెయిల్ చేశాడని నటుడు రాజా రవీంద్ర ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజ్ తరుణ్ కారు ప్రమాదం విషయమై పోలీసులు ఏం తేలుస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రాజ్ తరుణ్ ఉపయోగించిన కారు ప్రదీప్ అనే వ్యక్తి పేరున ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.కారు ప్రమాదం జరిగిన తర్వాత  సీసీ టీవీ పుటేజీ ఆధారంగా సినీ నటుడు రాజ్ తరుణ్ గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

రాజ్ తరుణ్ ఎపిసోడ్.. కార్తిక్ పై క్రిమినల్ కేసులున్నాయని చెప్పిన రాజారవీంద్ర

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్