గత రాత్రి జరిగిన కారు ప్రమాదంలో హీరో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ తరుణ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద మలుపులో కారు పక్కనే ఉన్న గోడని ఢీకొట్టింది. దీనితో పక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో కారు స్పల్పంగా  ధ్వంసమైంది. కానీ కారులో ఉన్నవారెవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ప్రమాదానికి గురైన సమయంలో రాజ్ తరుణ్ తో పాటు, నిర్మాత రామ్ తాళ్లూరి కూడా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు ఎవరు నడిపారు అనే దానిపై సమాచారం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

నిద్రమత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపారా లేక రాజ్ తరుణ్ మద్యం సేవించాడా అనే అనునాలు పోలీసులు రేకెత్తిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ ఎక్కడికెళ్లాడనే విషయం తెలియలేదు. కాగా ప్రమాదానికి గురైన కారు రాజ్ తరుణ్ పేరున కాకుండా మరొకరి పేరున రిజిస్టర్ అయి ఉంది. హీరో రాజ్ తరుణ్ స్పందిస్తే కానీ అసలు విషయం ఏంటన్నది తెలియదు. రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ హీరో తరుణ్

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!