సోమవారం రాత్రి అలకాపురి టౌన్ షిప్ వద్ద సినీ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడ్డాడు. అయితే ప్రమాద సమయంలో రాజ్ తరుణ్ పారిపోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన రాజ్ తరుణ్ భయంతో పారిపోయినట్లు చెప్పాడు. అయితే ఈ కేసులో కార్తిక్ అనే వ్యక్తి ఎంటర్ అయి ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రాజ్ తరుణ్ తాగి డ్రైవ్ చేశాడని దానికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు. వాటిని బయటపెట్టకుండా ఉండడానికి తనతో డీల్ మాట్లాడారని కార్తిక్ సంచలన కామెంట్స్ చేశారు. రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర, ఓ మహిళ తనకు డబ్బులిచ్చి విషయాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేశారని కార్తిక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఈ విషయంలో రాజా రవీంద్ర వెర్షన్ మరో విధంగా ఉంది. కార్తిక్ ఎవరో తనకు తెలియదని.. అలాంటప్పుడు అతడికి ఫోన్ ఎలా చేస్తానని ప్రశ్నించాడు రాజారవీంద్ర.  అంతేకాదు.. కార్తీక్ రూ5 లక్షలు డిమాండ్ చేస్తూ రాజ్ తరుణ్ ని బ్లాక్ మెయిల్  చేసాడని ఆరోపించాడు. తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ రాజా రవీంద్ర కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాడు. కార్తిక్ పై చాలా కేసులు ఉన్నాయని కూడా చెప్పాడు.

గతంలో కార్తిక్.. హీరో సందీప్ కిషన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశాడని.. అతడిపై 498A సెక్షన్ కింద కేసు నమోదైందని చెప్పారు. క్రిమినల్ ఇంటెన్షన్స్ ఉన్న కారణంగా అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడని రాజారవీంద్ర అన్నారు. అయితే ఈ విషయాలను కార్తిక్ కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై లీగల్ ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు రాజ్ తరుణ్. 

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్