Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి బాబు: వెనక్కి తగ్గిన టీడీపీ రెబెల్స్

 తెలంగాణలో తమ పార్టీ  పోటీ చేస్తున్న స్థానాలతో పాటు మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన  టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు.

chandrababu naidu discussed with rebel candidates in telangana elections
Author
Hyderabad, First Published Nov 22, 2018, 12:06 PM IST

అమరావతి: తెలంగాణలో తమ పార్టీ  పోటీ చేస్తున్న స్థానాలతో పాటు మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన  టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు.

తెలంగాణలోని 13 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. బుధవారం నాడు రాత్రి చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నుండి కూడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇబ్రహీంపట్నం నుండి టీడీపీ నుండి సామ రంగారెడ్డి కూడ బరిలోకి దిగారు.

తెలంగాణలోని 13 అసెంబ్లీ స్థానాల్లో 52 మంది అభ్యర్థులు  బరిలో ఉన్నారు. శేరిలింగంపల్లి నుండి భవ్య ఆనంద్ ప్రసాద్‌ కు టీడీపీ టికెట్టు కేటాయించింది.  కానీ, ఈ స్థానం కోసం చివరివరకు ప్రయత్నించిన మువ్వ సత్యనారాయణ కూడ నామినేషన్ దాఖలు చేశారు. మువ్వ సత్యనారాయణ కూడ నామినేషన్‌‌ను  ఉపసంపరింపజేసేలా  టీడీపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ మేరకు  చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు  టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలను అప్పగిస్తూ  ఎల్. రమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నంలో  సామ రంగారెడ్డికి టీడీపీ టికెట్టు ఇచ్చింది. కానీ, ఎల్బీనగర్ టికెట్టు ఆశించిన  సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం టికెట్టు కేటాయించడంతో  స్థానిక నేత భీంరెడ్డి రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేశారు.

కుత్బుల్లాపూర్ స్థానాన్ని  టీడీపీ ఆశించింది. కానీ ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా  బూరుగుపూడి హనుమంతరావు నామినేషన్ దాఖలు చేశారు. కూకట్‌పల్లిలో హరీశ్వర్ రెడ్డి, జూబ్లీహిల్స్ లో జీవీజీనాయుడు, ఖైరతాబాద్ లో బీఎన్ రెడ్డి ,పటాన్ చెరువులో నందీశ్వర్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.

కూకట్‌పల్లి నుండి నందమూరి హరికృష్ణ కూతురు  నందమూరి సుహాసిని  బరిలోకి దిగింది. ఈ స్థానం నుండి  హరీశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పటాన్ చెరువు నుండి పోటీ చేయాలని భావించినా ఈ స్థానం కాంగ్రెస్ టీడీపికి కేటాయించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్  నందీశ్వర్ గౌడ్ తో వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

బీఎన్ రెడ్డి, హనుమంతరావు, శోభారాణి తదితరులను  చంద్రబాబునాయుడు పిలిపించి మాట్లాడారు. నామినేషన్లను ఉప సంహారణ చేసుకోవాలని బాబు ఆదేశించారు.  మరో వైపు తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ఇతర పార్టీలు కూడ నామినేషన్లు దాఖలు చేయడంపై  టీడీపీ  కేంద్రీకరించింది.

మహాబూబ్ నగర్‌ నుండి టీడీపీ పోటీ చేస్తోంది. టీడీపీ అభ్యర్థిగా ఎర్ర శేఖర్ బరిలోకి దిగాడు. కానీ, టీజేఎస్ నుండి  రాజేందర్ రెడ్డి బరిలోకి దిగాడు.  రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీకి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. 

కానీ, ఆ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని   మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు  కార్తీక్ రెడ్డి  భావించాడు. కానీ ఈ స్థానం టీడీపీకి కేటాయించడంతో కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ తరుణంలో  కార్తీక్ రెడ్డి ఏ మేరకు టీడీపీకి సహకరిస్తారనే చర్చ సాగుతోంది. కార్తీక్ రెడ్డిని  టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా గెలుపుకు సహకరించేలా  కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై  ఒత్తిడి తీసుకురావాలని  టీడీపీ భావిస్తోంది.

మరోవైపు అంబర్ పేట స్థాన నుండి రెబెల్ గా బరిలోకి దిగిన ప్రవీణ్ కూడ తన నామినేషన్ ను ఉపసంహరించుకోనున్నట్టు  ప్రకటించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు ప్రవీణ్ నామినేషన్ ను ఉప సంహరించుకొంటారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

 

సంబంధిత వార్తలు

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

తీవ్ర అసంతృప్తి: సామకు బాబు బుజ్జగింపులు, తప్పని రెబెల్ బెడద

అమరావతిలో ఎల్‌బి నగర్ పంచాయతీ.. బాబుతో సామ భేటీ

టీ టీడీపీ రెండో జాబితా విడుదల

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను తాకిన అసంతృప్తి జ్వాల, కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

బరిలో రేవూరి: కీలక నిర్ణయం దిశగా నాయిని, ఆ పార్టీకి షాకేనా...

 

  

 


 

Follow Us:
Download App:
  • android
  • ios