హైదరాబాద్: తన కళ్లలోకి చూడటానికి టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర రావు భయపడుతున్నారని  తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ కుమ్మక్కై తనపై కక్ష సాధిస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.

 రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి కనీసం నాలుగు నెలలైనా జైల్లో పెట్టాలని అనుకున్నారని, ఇలా ప్లాన్‌ చేసేది కేసీఆర్ అయితే దాన్ని అమలు చేసేది మోడీ అని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీగా ఉందని అన్నారు. తన విశ్వసనీయతను గుర్తించి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు.
 
 రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత తన ఆస్తుల విలువ పెరిగిందో లేదో విశ్లేషించాలని, పాత్రికేయ మిత్రులు విశ్లేషిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. జగ్గారెడ్డి, గండ్ర, కూన శ్రీశైలం సహా తనపై కుట్రలు చేశారని అన్నారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌లో ఉన్న ఇంటిని నత కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని స్పష్టం చేశారు.
 
 2014లో బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా నిర్మాణానికి రుణాలు తీసుకున్నారని, తన ఇంటిలో కిరాయికి ఉన్నవాళ్లు కంపెనీలు పెట్టుకుంటే రేవంత్‌రెడ్డి కంపెనీలని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన గురించి తన కుటుంబం గురించి మాట్లాడేవారికి బినామీ ఆస్తులంటే అర్ధం తెలుసా అని అడిగారు. 

హాంకాంగ్‌లో బ్యాంక్‌ ఖాతా ఉండాలంటే ఆ దేశ పౌరుడై ఉండాలని, మలేసియాలో అంతకన్నా కఠినమైన నిబంధనలు ఉన్నాయని, 2009 తర్వాత ఒక్కసారి కూడా తాను హాంకాంగ్, మలేసియా వెళ్లలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తనదని చూపిస్తున్న విదేశీబ్యాంక్‌ ఖాతా నెంబర్‌లో 13 అంకెలు ఉన్నాయని  అన్నారు. కేసీఆర్‌ తన ఇంట్లోని వారి తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని బిక్కుబిక్కుమంటున్నారని వ్యాఖ్యానించారు. 
 
కేసీఆర్‌ తనను ఎదుర్కొనేందుకు ఏసీబీని ప్రయోగించారని, కేసీఆర్‌ కులాల మధ్య పోరుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. అండమాన్‌ జైల్లో పెట్టినా కేసీఆర్‌పై పోరాటం సాగిస్తానని, కేసీఆర్‌ అవినీతిపై తెలంగాణ మొత్తం ప్రచారం చేస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు: న్యాయవాది రామారావు చరిత్ర ఇదీ...

ఐటి సోదాలు: రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి (ఫొటోలు)

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...