Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

 షెల్ కంపెనీల ద్వారా విదేశీ నిధులను తనతో పాటు తన కుటుంబసభ్యుల పేర్లపై  రేవంత్ రెడ్డి మార్చాడనే ఆరోపణలు  ప్రచారంలో ఉన్నాయి

how revanth reddy got money from other countries
Author
Hyderabad, First Published Sep 27, 2018, 7:01 PM IST


హైదరాబాద్: షెల్ కంపెనీల ద్వారా విదేశీ నిధులను తనతో పాటు తన కుటుంబసభ్యుల పేర్లపై  రేవంత్ రెడ్డి మార్చాడనే ఆరోపణలు  ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు గురువారం నాడు రేవంత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు.

అమెరికా, దుబాయ్, మలేషియాల నుండి పెద్ద ఎత్తున నిధులను  రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు వచ్చి చేరిందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.

2014లో రేవంత్‌కు ఒకే రోజు రూ9 కోట్లు  వచ్చిన విషయాన్ని ఐటీ అధికారులకు పిర్యాదు అందిందని సమాచారం. రామారావు అనే న్యాయవాది ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.ఈ ఫిర్యాదు ఆధారంగా  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అయితే ఎన్నికల సందర్భంగా 2009 నుండి దాఖలు చేసిన అఫిడవిట్లో రేవంత్ తన ఆస్తులను రూ.3.6 కోట్లు ఉందని  పేర్కొన్నాడు. 2014 నాడు ఎన్నికల అఫిడవిట్ ‌లో తన ఆస్తులను రూ.13.12 కోట్లుగా చూపారు. అయితే ఐదేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి రూ.10 కోట్లను ఎలా సంపాదించారని  ఫిర్యాదుదారుడు రేవంత్‌ గురించి ప్రశ్నించారని సమాచారం.

అయితే  రేవంత్ తన ఆదాయాన్ని ఏడాదికి రూ.5లక్షలుగా పేర్కొన్న విషయాన్ని కూడ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.  ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భారీగా  ఆస్తులను  రేవంత్ రెడ్డి కూడబెట్టారని ఈడీ,  ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో పాటు  ఆయన అల్లుడు,వియ్యంకుడిపై కూడ  ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వియ్యకుండుకు చెందిన సంస్థ అక్రమాలకు కేంద్రంగా ఉందనే ఆరోపణలు  ఉన్నాయి. బ్యాంకులను మోసం చేసి రూ.65 కోట్లు,  వ్యవసాయ రుణాల పేరుతో రూ.75 కోట్లు కొల్లగొట్టాడని ఫిర్యాదు దారుడు ఐటీకి ఇచ్చినట్టు సమాచారం.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, బ్లాక్ మనీ ఇంకంటాక్స్ 2015,  ప్రోహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, ప్రోహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988  చట్టాల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.  షెల్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయాలను రేవంత్ రెడ్డి  కుటుంబసభ్యులు పొందారని  ఆ న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. 

అయితే రేవంత్ రెడ్డి  ఫెమా నిబంధనలను ఉల్లంఘించి, బినామీ పేర్లతో తనతో పాటు తన కుటుంబసభ్యుల పేర్లతో వందల కోట్లను   సంపాదించారని  ఫిర్యాదు దారుడు ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు  సమాచారం.

సంబంధిత వార్తలు

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

ఓవైపు ఐటి దాడులు జరుగుతుంటే డోలు వాయిస్తూ రేవంత్ జోష్ (వీడియో)

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

 

Follow Us:
Download App:
  • android
  • ios