ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ వేడి గత కొన్నిరోజులుగా తారాస్థాయికి చేరుకుంది. మొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టుతో మొదలై ఇప్పుడు రేవంత్ అరెస్ట్ వరకు ప్రతిపక్ష నాయకులే టార్గెట్ అవుతున్నారు. ఇవాళ ఉదయం నుండి రేవంత్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నారు. 

ఈ ఐటీ దాడులపై రేవంత్ కోస్గి సభలో భావోద్వేగంగా మాట్లాడారు. గతంలో తన కూతురి లగ్న పత్రిక రాసుకునే రోజునే అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడేమో ఇలా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిపి దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. డిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ (కేసీఆర్) ఇద్దరు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వారికి తాను భయడబోనని అన్నారు రేవంత్. 

ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డితో ఇంటితో పాటు అతడి బంధువుల ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగిన విషయం తెలసిందే. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి. అయితే మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్  జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. దీంతో అక్కడి వాతావరణం గంబీరంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అటు రాజకీయ నాయకుల్లో ఇటు ప్రజల్లోనూ ఉత్కంట నెలకొంది.

అయితే తన ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రచారాన్ని మాత్రం ఆపలేదు. తన నియోజకవర్గంలో ప్రచారాన్ని యదావిధిగా కొనసాగించారు. ప్రచారం తర్వాతే ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో రేవంత్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారనున్నట్లు చర్చ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు