Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. 

advocate rama rao complaints against revanth reddy
Author
Hyderabad, First Published Sep 27, 2018, 7:22 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. రేవంత్‌తో పాటు ఆయన బంధువులు కూడ అక్రమాలకు పాల్పడినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రేవంత్‌ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడ  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రేవంత్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.గురువారం ఉదయం నుండి రేవంత్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. 


శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో  రేవంత్ రూ. 66 లక్షలు రేవంత్ పెట్టుబడి పెట్టారు. రేవంత్‌రెడ్డి మరో 8 మందితో కలిసి 2003లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 2010లో చివరిసారిగా ఐటీ లెక్కలు చూపించారు. 

18 షెల్ కంపెనీలకు డబ్బు దారి మళ్లించారు. 2014 ఎలక్షన్ ఆఫిడవిట్‌లో మౌర్య కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు రేవంత్ పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకు చెందిన అధికారులను మభ్యపెట్టి రేవంత్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీకి రామారావు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకు చెందిన అధికారులను మభ్యపెట్టి రేవంత్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీకి రామారావు ఫిర్యాదు చేశారు. 


2010 తర్వాత శ్రీసాయి మౌర్య కంపెనీ ఎలాంటి బ్యాలెన్స్ షీట్ చూపలేదని ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు న్యాయవాది రామారావు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన వెల్లడించారు. 

ఆదాయ పన్ను శాఖకు దొరకకుండా వందల కోట్ల లావాదేవీలు జరిగాయని న్యాయవాది రామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీలో జరిగిన అక్రమాలు తానే బయటపెట్టినట్టు ఆయన చెప్పారు. 19 కంపెనీల ద్వారా 200 నుంచి 300 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.. విదేశీ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.. రేవంత్‌రెడ్డి అక్రమ సంపాదన, అక్రమ ఆస్తులు ఇంకెన్నో బయటపడాల్సి ఉంది అని న్యాయవాది రామారావు తెలిపారు. 


2014, ఫిబ్రవరి 25న సింగపూర్‌లోని ఒక స్థిరాస్తిని 20 లక్షల సింగపూర్ డాలర్లకు రేవంత్‌రెడ్డి విక్రయించినట్లు ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. అదే రోజున రేవంత్‌రెడ్డికి హాంకాంగ్ బ్యాంకు ఖాతా నెం. 1260779653146కు 60 లక్షల మలేషియన్ రింగెట్స్‌ను రఘువరన్ మురళి అనే వ్యక్తి బదిలీ చేశారని రామారావు చెప్పారు.  

మలేషియాకు చెందిన  ఆర్‌హెచ్‌బీ బ్యాంకు ఖాతా నెం. 1300098050844099కు మురళీ ఖాతా నుండి రూ.20 లక్షల సింగపూర్ డాలర్లు(రూ. 9 కోట్ల 53 లక్షలు) బదిలీ చేశారని చెప్పారు.2014, ఫిబ్రవరి 25న ఒక్కరోజే రేవంత్‌రెడ్డి బ్యాంకు అకౌంట్లలో రూ. 20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. 

దుబాయ్‌లో హవాలా ద్వారా రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఎన్నో అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడ్డారని రామారావు ఆరోపించారు.  అమెరికాలో ఉన్న మరో తమ్ముడు జగన్ రెడ్డి ద్వారా కూడా ఎన్నో అక్రమ కార్యకలాపాలు నిర్వహించారన్నారు.. 

గత 20 సంవత్సరాలుగా రేవంత్‌రెడ్డికి బినామీగా వియ్యంకుడు వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని  రామారావు ఆరోపించారు. . నెక్సస్ ఫీడ్స్ లిమిటెడ్ పేరుతో షెల్ కంపెనీ నిర్వహిస్తూ రూ. 65 కోట్ల ప్రజాధనాన్ని రేవంత్‌రెడ్డి కొల్లగొట్టాడన్నారు.

రూ. 14 కోట్లతో చైనా తైవాన్ నుంచి గోల్డెన్ ఫీడ్స్ పేరుతో మిషనరీని కొనుగోలు చేసిన వెంకట్‌రెడ్డి.. అదే మిషనరీని మరో బినామీ సయ్యద్ ఉబేద్‌కు చెందిన పయనీర్ ఎక్వీప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌కి రూ. 25 కోట్లకు అమ్మాడన్నారు. 

మళ్లీ అదే మిషనరీని రూ. 80 కోట్ల(ఇందులో రూ. 75 కోట్ల బ్యాంక్ లోన్)కు నెక్సస్ ఫీడ్ కొనుగోలు చేసింది. చేతులు మార్చడం ద్వారా ఒకే మిషనరీ ధరను రూ. 25 కోట్ల నుంచి రూ. 80 కోట్లకు రేవంత్‌రెడ్డి అండ్ కంపెనీ పెంచినట్లు ఫిర్యాదులో రామారావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

ఓవైపు ఐటి దాడులు జరుగుతుంటే డోలు వాయిస్తూ రేవంత్ జోష్ (వీడియో)

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

Follow Us:
Download App:
  • android
  • ios