ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలేరు నియోజకవర్గంలో మోత్కుపల్లి ప్రచారానికి వెళ్లిన సమయంలో జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై చేసిన దాడికి నిరసనగా మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఆందోళన నెలకొంది. 

ఈ ఘటన యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం లో చోటుచేసుకుంది. టిడిపి పార్టీ నుండి బైటికి వచ్చిన తర్వాత మోత్కుపల్లి ఏ పార్టీలో చేరలేదు. దీంతో ఆలేరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. అయితే హటాత్తుగా అతడు బహుజన లెప్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ నుండి పోటీకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో మోత్కుపల్లి పేరును చేర్చింది.  

దీంతో నియోజకవర్గ పరిదిలో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.  ఇవాళ మల్లాపురంలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కూడా అదే గ్రామంలో ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు వర్గాలు తారసపడటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.  ఈ గొడవలో బిక్షమయ్య గౌడ్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు మోత్కుపల్లిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో మోత్కుపల్లికి ఎలాంటి గాయాలు కాలేదు.  

తమపై దాడిచేసిన భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆలేరులో నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  
 

మరిన్ని వార్తలు

ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు ధర్నా ... భారీ ట్రాఫిక్‌జామ్

చివరకు మోత్కుపల్లి ఇక్కడ సెటిలయ్యారు

గవర్నర్ పదవి ఇస్తానని చంద్రబాబు మోసం: మోత్కుపల్లి

నేను రాజకీయ నేతను కాదు: మోత్కుపల్లి

అందుకే కేసీఆర్ నన్ను పిలవలేదు: మోత్కుపల్లి నర్సింహులు

ఈ ఎన్నికలే నాకు చివరివి: మోత్కుపల్లి

ముందస్తు ఎన్నికలు.. మోత్కుపల్లి సంచలన ప్రకటన

మోత్కుపల్లికి చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ షాక్: ఎందుకు?

కాపు రిజర్వేషన్లు: జగన్ వ్యాఖ్యల్లో తప్పు లేదు: మోత్కుపల్లి