హైదరాబాద్:ఆలేరు  అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా మోత్కుపల్లి నర్సింహులు బరిలోకి దిగుతున్నారు. టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేయడంతో నర్సింహులును  పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 7వ తేదీన జరిగే  ఎన్నికల్లో ఆలేరు నుండి  తాను బరిలోకి దిగుతున్నట్టుగా నర్సింహులు ఇప్పటికే ప్రకటించారు. ప్రచారాన్ని కూడ నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 18వ తేదీన  టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని  నర్సింహులు కోరారు. ఈ ఏడాది మే 28 వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకొని మోత్కుపల్లి నర్సింహులును పార్టీ నుండి బహిష్కరించారు.ఆ తర్వాత చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి తీవ్రమైన విమర్శలు చేశారు.

అయితే శుక్రవారం నాడు బీఎల్ఎఫ్ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు చోటు దక్కింది.  బీఎల్ఎఫ్  అభ్యర్థిగా ఆలేరు నుండి  నర్సింహులు  బరిలో నిలుస్తున్నారు. నర్సింహులుతో పాటు మరో 28 మంది అభ్యర్థుల పేర్లను  బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం శుక్రవారం నాడు విడుదల చేశారు.  

సంబంధిత వార్తలు

గవర్నర్ పదవి ఇస్తానని చంద్రబాబు మోసం: మోత్కుపల్లి

నేను రాజకీయ నేతను కాదు: మోత్కుపల్లి

అందుకే కేసీఆర్ నన్ను పిలవలేదు: మోత్కుపల్లి నర్సింహులు

ఈ ఎన్నికలే నాకు చివరివి: మోత్కుపల్లి

ముందస్తు ఎన్నికలు.. మోత్కుపల్లి సంచలన ప్రకటన

మోత్కుపల్లికి చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ షాక్: ఎందుకు?

కాపు రిజర్వేషన్లు: జగన్ వ్యాఖ్యల్లో తప్పు లేదు: మోత్కుపల్లి