రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని.. రేపు యాదగిరిగుట్టలో మోత్కుపల్లి శంఖారావం ద్వారా ప్రజల్లోకి వెళతానని స్పష్టం చేశారు..

ఆలేరు ప్రజల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. నియోజకవర్గానికి గోదావరి జలాలు సాధించడమే తన లక్ష్యమని అన్నారు. తాను రాజకీయ నేతను కానని.. ప్రజా సేవకుడినని నర్సింహులు అన్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించడంతో మోత్కుపల్లి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో పాటు.. చివరిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అందుకే కేసీఆర్ నన్ను పిలవలేదు: మోత్కుపల్లి నర్సింహులు

ఈ ఎన్నికలే నాకు చివరివి: మోత్కుపల్లి

ముందస్తు ఎన్నికలు.. మోత్కుపల్లి సంచలన ప్రకటన

మోత్కుపల్లికి చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ షాక్: ఎందుకు?

కాపు రిజర్వేషన్లు: జగన్ వ్యాఖ్యల్లో తప్పు లేదు: మోత్కుపల్లి