యాదగిరిగుట్ట: టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్టలో మోత్కుపల్లి శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. 

ఆలేరు నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. ఇవే తన జీవితంలో చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నా సేవలను ఉపయోగించుకుంటారని అనుకున్నానని కానీ వినియోగించుకోలేదని తెలిపారు. 

మరోవైపు తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. చంద్రబాబు నాయుడు వల్లే తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు తనను తీవ్రంగా మోసం చేశారన్నారు. గవర్నర్ పదవి లేదా ఎంపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు.