బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి
తనకు పోటీ చేయాలని ఉందని సుహాసిని కోరిన వెంటనే భువనేశ్వరి ఆమెను కూకట్‌పల్లి అభ్యర్థిగా సిఫాసరసు చేశారని అంటున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి చొరవతేనే సుహాసిని కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావాలని తనకు చిన్నప్పటి నుంచి ఉందని నందమూరి సుహాసిని శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.
తనకు పోటీ చేయాలని ఉందని సుహాసిని కోరిన వెంటనే భువనేశ్వరి ఆమెను కూకట్‌పల్లి అభ్యర్థిగా సిఫాసరసు చేశారని అంటున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుమారుల బాధ్యతలను కూడా భుూవనేశ్వరి తీసుకున్నారని తెలుస్తోంది.
కాగా, కల్యాణ్ రామ్ ను కూకట్ పల్లి నుంచి పోటీకి దించాలని చంద్రబాబు భావించారు. అయితే, కల్యాణ్ రామ్ అందుకు అంగీకరించలేదు. దాంతో సుహాసినిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబ సభ్యులు తెలంగాణలో పోటీ చేయడం ఇష్టం లేదని అంటున్నారు.
నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసి, స్మారక నిర్మాణ బాధ్యతలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం తీసుకుంది. ఈ స్థితిలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీ చేయడం భావ్యం కాదని కల్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ భావించినట్లు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని
హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని
నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు
కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి
మీడియా ముందుకు నందమూరి సుహాసిని
33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని
‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?