‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
సినీనటుడు దివంగత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ముద్దుల తనయ సుహాసిని ప్రవర్తనలో ఇటీవల భారీ మార్పులు చేసుకున్నాయట. తన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కంటే తన మావయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం.
హైదరాబాద్: సినీనటుడు దివంగత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ముద్దుల తనయ సుహాసిని ప్రవర్తనలో ఇటీవల భారీ మార్పులు చేసుకున్నాయట. తన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కంటే తన మావయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం.
అందుకు కారణం కూడా లేకపోలేదు. సుహాసినికి ఆమె సోదరుడు జానికి రామ్ అంటే చాలా ఇష్టం. కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లు సినిమాల్లో నిత్యం బిజీబిజీగా గడపడంతో సుహాసిని ఎక్కువ సమయం సోదరుడు జానికిరామ్ తోనే ఉండేదట. జానకిరామ్ అంటే విపరీతమైన ప్రేమ కూడా. ఏ విషయంలోనూ అన్నమాట జవదాటేది కాదట.
అయితే వ్యాపార అవసరాల రీత్యా జానకిరామ్ కు డబ్బు అవసరం వస్తే సుహాసిని తనకి సంబంధించిన ఆస్థులను బ్యాంకులో తనఖా పెట్టి ఆ అవసరం తీర్చారట. అయితే అనుకోకుండా జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బ్యాంకు రుణాలు తీర్చడం ఆమెకు పెద్ద సమస్యగా మారిందట.
బ్యాంకు రుణాల విషయంలో కుటుంబ సభ్యులకు చెప్పినా ఎవరూ ముందుకు రాలేదట. ఆ సమయంలో మావయ్య ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. నేరుగా రంగంలోకి దిగిన చంద్రబాబు సుహాసినిని అప్పుల ఊబినుంచి బయటపడేశారని టాక్. అందువల్లే సుహాసిని జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కంటే చంద్రబాబుకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.
తెలంగాణ టీడీపీ నేతలు కూకట్ పల్లి లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి నందమూరి కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. అంతేకాదు హీరో కళ్యాణ్ రామ్ తో కూడా చర్చించారు. అయితే తనకి ప్రస్తుతం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని తేల్చిచెప్పేశారట.
తాను ఇంకా తన తండ్రి హరికృష్ణ మరణం నుంచి కోలుకోలేదని అయినా ఇంకా పది, పదిహేను సంవత్సరాలు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పేశారట. దీంతో దివంగత జానికిరామ్ భార్యను కూడా సంప్రదించారట. ఆమె కూడా ఆసక్తి చూపలేదు. పైగా తన మరదలు సుహాసిని పేరు సూచించినట్లు సమాచారం.
దీంతో చంద్రబాబు నాయుడు సుహాసినిన టార్గెట్ చేశారు. సుహాసినికి టిక్కెట్ ఇస్తే నందమూరి అభిమానుల అభిమానం చూరగొనడంతోపాటు హరికృష్ణ కుటుంబాన్ని ఆదుకున్నామన్న సంకేతాలు ప్రజల్లో బలంగా వెళ్తాయని భావించారు. అలాగే కూకట్ పల్లినియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉండటం ఇటీవలే హరికృష్ణ మృతిచెందడంతో ఆ సానుభూతి కలిసి వస్తుందని ఆలోచించారు.
ఈ నేపథ్యంలో సుహాసిని అభ్యర్ధిత్వాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె అభ్యర్ధిత్వాన్ని తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సినీ హీరోలు సుహాసిని సోదరులు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆమెను పోటీ చేయోద్దని వారించారు కూడా. అయితే చంద్రబాబు చాకచక్యంగా చక్రం తిప్పి కుటుంబ సభ్యుల అంగీకారం పొందారు. సుహాసిని ఒప్పించారు. దీంతో ఆమెకి లైన్ క్లియర్ చేశారు. శనివారం సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?