కూకట్ పల్లి నియోజకవర్గ టికెట్ ను టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినీకి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమెకు టికెట్ కేటాయించడంపై మిత్రపక్షం కాంగ్రెస్ నేతల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఆమెకు ఎలా టికెట్ కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్ పల్లి స్థానం టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సీటు మొదట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డికి కేటాయిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా తెరపైకి సుహాసినీ పేరు వచ్చింది. చంద్రబాబు స్వయంగా ఆమెను ఒప్పించి మరీ.. ఈ టికెట్ కట్టబెట్టారు.

ఈ టికెట్ ని స్థానికులకు కాకుండా ఎక్కడో ఉండే సుహాసినికి కేటాయించడం కూటమిలో చాలా మందికి రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు కేపీహెచ్ బీ రోడ్ నెం.1లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి నియోజకవర్గాల్లో కమమ్ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడం పై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో తమ తరపున సమర్థుడైన నాయకుడు రెబల్ గా బరిలో నిలుస్తారని ప్రకటించారు. సుహాసినిని చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు. చంద్రబాబు కుల రాజకీయాలు ఏపీలో చేసుకోమని.. తెలంగాణలో కాదని హితవు పలికారు. 

read more news

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?