భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వైరస్ సోకిన వ్యాధి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందిన వారిలో  ఒకరికి బదులుగా మరొకరిని ఆసుపత్రిని డిశ్చార్జ్ చేశారు. గురువారం నాడు మరోసారి పరీక్షలు నిర్వహిస్తే డిఎస్పీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడిని మళ్లీ ఆసుపత్రికి తరలించారు.

భద్రాచలం  డిఎస్పీ తనయుడు విదేశాల నుండి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టాడు. ఈ విషయం వెలుగు చూడడంతో డిఎస్పీతో పాటు ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషికి కూడ కరోనా సోకింది. దీంతో వీరిని కూడ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

also read:కరోనా ఎఫెక్ట్: ఈ నెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

హైద్రాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో భద్రాచలం డిఎస్పీ అలీని ఉంచి చికిత్స అందించారు. అయితే ఇదే ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ లక్షణాలతో షేక్ అలీ అనే వ్యక్తి కూడ చికిత్స పొందుతున్నాడు.

షేక్ అలీ రిపోర్టు నెగిటివ్ గా వచ్చింది. దీంతో షేక్ అలీని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే షేక్ అలీకి బదులుగా భద్రాచలం డిఎస్పీ అలీని గురువారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

గురువారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడంతో అలీ ఇంటికి చేరుకొన్నారు. అయితే అలీకి మరోసారి పరీక్షలు చేయడంతో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. దీంతో ఆయనను శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రికి తరలించారు.