కరోనా ఎఫెక్ట్: ఈ నెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

:తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 11వ తేదీన జరగనుంది. కరోనా నియంత్రణ,లాక్‌డౌన్ తో పాటు అకాల వర్షాల వల్ల పంట నష్టంపై  తెలంగాణ రాష్ట్ర కేబినెట్  చర్చించనుంది.

corona effect:Telangana cabinet to meet on Saturday


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 11వ తేదీన జరగనుంది. కరోనా నియంత్రణ,లాక్‌డౌన్ తో పాటు అకాల వర్షాల వల్ల పంట నష్టంపై  తెలంగాణ రాష్ట్ర కేబినెట్  చర్చించనుంది.

రాష్ట్రంలో 414 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 45 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో 12 మంది మృత్యువాత పడ్డారు.

శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు  ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించాయి.

also read:హైద్రాబాద్‌లో సూపర్ మార్కెట్లోకి అనుమతి నిరాకరణ:ముగ్గురి అరెస్ట్

లాక్‌డౌన్ ను పొడిగించాలని కూడ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.  కరోనా నియంత్రణ కోసం ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై కూడ కేబినెట్ లో చర్చించనున్నారు.

రెండు రోజులుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతింది. మరో వైపు ధాన్యాన్ని  తామే కొనుగోలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసే విషయంలో తలెత్తిన ఇబ్బందులను ఎలా అధిగమించే విషయంలో కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

వలస కార్మికులను ఆదుకొనే విషయంతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కూడ కేబినెట్ లో చర్చిస్తారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకొంది. వీటితో పాటు ఇతర అంశాలపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios