ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌కు బీసీల సెగ తాకింది. సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం చేస్తున్నారంటూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఇవాళ గాంధీభవన్‌ను ముట్టడించారు
ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌కు బీసీల సెగ తాకింది. సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం చేస్తున్నారంటూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఇవాళ గాంధీభవన్‌ను ముట్టడించారు.
మహాకూటమి పొత్తులో భాగంగా మల్కాజిగిరి సీటును తెలంగాణ జన సమితికి (టీజేఎస్) కేటాయించడం స్థానిక కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఈ స్థానంపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న నందికంటి శ్రీధర్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి గాంధీభవన్‌లో నిరసన వ్యక్తం చేశారు..
ప్రధాన ద్వారం గేట్లు తొలగించి లోపలికి వెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాల వారికే పెద్దపీట వేస్తున్నారని.. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు మొండిచేయి చూపుతున్నారని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారని.. కానీ పొత్తును సాకుగా చూపించి ఆయన్ను వరంగల్‌కు పంపేందుకు కుట్ర పన్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు.
అలాగే శేరిలింగంపల్లిలో భిక్షపతిని పక్కనబెట్టేందుకు ఆ సీటును తెలుగుదేశానికి కట్టబెట్టారంటూ వారు ఫైరవుతున్నారు. సీట్ల సర్దుబాటు విషయం ఇంకా ఒక కొలిక్కిరాకపోగా.. తుది జాబితా ప్రకటించకముందే అసంతృప్తుల సెగ తగలడంతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంది.
సీట్ల లొల్లి: టీడీపీ కోరుతున్న సీట్లివే, కాంగ్రెస్ నుండి అందని జాబితా
కేసీఆర్ వ్యూహం ఖరారు: టార్గెట్ చంద్రబాబు
టీజేఎస్ కార్యాలయంపై ఆగంతకుల దాడి.. ఉద్రిక్తత
సర్దుబాటుకు కోమటిరెడ్డి తూట్లు: నకిరేకల్ సీటుపై తిరుగుబాటు
అధిష్టానం ఫార్ములా: జానా సహా సీనియర్ నేతలకు షాక్
పోటీకి కోదండరామ్ దూరం?: టీజేఎస్ అభ్యర్థులు వీరే
కోదండరామ్ కు ఢిల్లీ పిలుపు: ఎందుకంత ప్రాధాన్యం
హరీష్, గజ్వేల్ నర్సారెడ్డి మధ్య రహస్య చర్చలు... రేవంత్ సంచలన ఆరోపణలు
పెండింగ్‌లో 25 సీట్లు: సోనియా, రాహుల్‌లదే ఫైనల్
