హైదరాబాద్‌: తమ పార్టీ అభ్యర్థుల జాబితా వెల్లడిపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని ఆయన గురువారం మీడియాతో అన్నారు.

జాబితాపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీవీ న్యూస్‌ ఛానల్స్‌, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తున్న జాబితాలు నిజం కాదని, ఇంకా ఎటువంటి జాబితా సిద్ధం కాలేదని ఆయన వివరించారు.  

ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదని, అవి ఊహాజనీతమూ కల్పితం మాత్రమేనని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు వాటిని నమ్మవద్దని కోరారు. పార్టీ అభ్యర్థుల జాబితా రేపు(శుక్రవారం) విడుదల చేస్తామని వివరించారు. 

అధికారికంగా జాబితా విడుదల అయ్యే వరకు ఎలాంటి జాబితాలు నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని ఆయన తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.