సికింద్రాబాద్ మల్కాజిగిరిలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఎన్నికల కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఆఫీసులోకి ప్రవేశించిన ఆగంతకులు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఆ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి కపిలవాయి దీలిప్ కుమార్ ఫ్లెక్సీలను చింపేశారు.

విషయం తెలుసుకున్న టీజేఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై టీజేఎస్ నేతలు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి... పార్టీ కార్యాలయంతో పాటు.. తనకు వ్యక్తిగత రక్షణ కల్పించాలని దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మల్కాజిగిరి సీటును తమకే కేటాయించాలని స్థానిక కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.

అధిష్టానం ఫార్ములా: జానా సహా సీనియర్ నేతలకు షాక్

సర్వే: కేసీఆర్ దే ప్రభంజనం, చంద్రబాబుతో కాంగ్రెసుకు గండి

పోటీకి కోదండరామ్ దూరం?: టీజేఎస్ అభ్యర్థులు వీరే

కోదండరామ్ కు ఢిల్లీ పిలుపు: ఎందుకంత ప్రాధాన్యం

100 సీట్లు కేసిఆర్ మైండ్ గేమే: అంత సీన్ ఉందా...

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

భుజాలపై చెయ్యేశాడు,బూతులు తిట్టాడు:రసమయిపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చంద్రబాబు వర్సెస్ కేసీఆర్