నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ కి అమృత వర్షిణి అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె కోసం చావడానికైనా సిద్ధమే అనేవాడని భార్య అమృత వర్షిణీ చెప్తోంది.

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ కి అమృత వర్షిణి అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె కోసం చావడానికైనా సిద్ధమే అనేవాడని భార్య అమృత వర్షిణీ చెప్తోంది. తనను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని పలుమార్లు హెచ్చరించినా నేను చనిపోయినా పర్వాలేదు నాకు నువ్వు కావాలి అనేవాడని బోరున విలపించింది. 

భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న అమృత వర్షిణీ తన భర్త ప్రణయ్ కు తానంటే ఎంత ఇష్టమో వివరిస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. కులాంతర వివాహం కారణంగా ఎదురయ్యే పరిణామాలను కూడా పట్టించుకోకుండా ప్రణయ్ తనను వివాహం చేసుకున్నట్లు చెప్తోంది. చివరికి తన తండ్రి బాబాయిల వల్ల ప్రాణహాని కూడా ఉండొచ్చని చెప్పినా తను నా కోసం చావడానికి అయినా సిద్ధ పడతానన్నాడని గుర్తుకు తెచ్చుకుని బరువెక్కిన గుండెతో విలపిస్తోంది. 

వివాహం తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు అంగీకరించారని తెలిపింది అమృత. ప్రేమ వివాహం చేసుకోవడం మా తప్పా....కులాంతర వివాహం చేసుకోవడం మా తప్పా అంటూ ఆమె గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న తీరు అందర్నీ కంట కన్నీరు తెప్పిస్తోంది. ప్రాణంగా ప్రేమించుకుని సంతోషంగా ఉంటున్న తమకు ఇలా జరుగుతుందని ఊహించలేదని బోరున విలపిస్తోంది అమృత. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)