గొంతులో ట్యాబ్లెట్ ఇరుక్కొని.. మూడేళ్ల బాలుడు మృతి

3years kid died of tablet in nagar kurnool
Highlights

శివ(3) కొన్ని రోజులుగా ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్సకోసం వైద్యుడిని సంప్రదించగా మాత్రలు ఇచ్చారు.

గొంతులో ట్యబ్లెట్ ఇరుక్కొని మూడేళ్ల పసివాడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకొంది. పెట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన కురువబెల్లరి పెద్ద మల్లయ్య కుమారుడు శివ(3) కొన్ని రోజులుగా ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్సకోసం వైద్యుడిని సంప్రదించగా మాత్రలు ఇచ్చారు.

 ప్రతి రోజు మాదిరిగానే చిన్నారి తల్లి శుక్రవారం మాత్ర వేస్తుండగా బాలుడి గొంతులో ఇరుక్కొంది. దీంతో ఊపిరాడక సతమతమవుతున్న శివను స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతిచెందాడని వైద్యుడు నిర్ధరించారు.

loader