Narendra Modi..ఒకే నాణెనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు ముఖాలు: తుక్కుగూడలో మోడీ
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మోడీ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తెలంగాణలో అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్:కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ప్రధాన మంత్రి మోడీ విమర్శించారు.శనివారంనాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల్లో తెలివి తేటలు పుష్కలంగా ఉన్నాయని మోడీ చెప్పారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ను దుబ్బాక,హుజూరాబాద్ లలో ప్రజలు తిప్పికొట్టారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గణనీయమైన సీట్లను కట్టబెట్టారని ప్రధానమంత్రి మోడీ గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని మోడీ పునరుద్ఘాటించారు.
also read:Amit Shah.... కేటీఆర్ ను సీఎం చేయడంపైనే కేసీఆర్ ధ్యాస: కొల్లాపూర్ సభలో అమిత్ షా
కేసీఆర్, కాంగ్రెస్ నేతలు అభివృద్ది గురించి కాకుండా తనను తిట్టడానికే ప్రాధాన్యత ఇస్తారని మోడీ విమర్శించారు.గిరిజన అభ్యర్థి ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వారికి మంత్రి పదవులను కేసీఆర్ ఇచ్చారని మోడీ విమర్శలుచేశారు.దళిత బంధు బీఆర్ఎస్ నేతలకు
కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు కార్బన్ పేపర్ లా పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ కు ఓటు వేయడమంటే బీఆర్ఎస్ కు ఓటు వేయడమేనని మోడీ చెప్పారు.కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్తారన్నారు.
also read:Narendra Modi:బెంగుళూరులో తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని ప్రయాణం (వీడియో)
తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తన లక్ష్యంగా మోడీ పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు స్వార్థ పార్టీలు, సమాజ విరోధులని మోడీ పేర్కొన్నారు.మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.
also read:Narendra Modi...సకల జనుల సౌభాగ్య తెలంగాణ లక్ష్యం: కామారెడ్డి సభలో నరేంద్ర మోడీ
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్,కాంగ్రెస్ లు నాణేనికి రెండు ముఖాలని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని ోడీ హామీ ఇచ్చారు. మాదిగల వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మోడీ చెప్పారు.