సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. 

బెంగుళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు తేలికపాటి  తేజస్ యుద్ధవిమానంలో  ప్రయాణించారు.కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ను ప్రధాని ఇవాళ సందర్శించారు.

 

తేజస్ జెట్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ  పరిశీలించారు.  హెచ్ఏఎల్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు.

 రక్షణ రంగంలో  స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యతను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు.  రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను దేశంలోనే  తయారీ చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మోడీ గుర్తు చేశారు. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుందని  మోడీ గుర్తు చేశారు. తేజస్ యుద్ధ విమానం  గురించి  ఇతర దేశాలు కూడ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అమెరికా పర్యటన సందర్భంగా  ఎంకె-2 తేజస్ ఇంజన్ ల ఉత్పత్తి కోసం  జీఈ ఏరోస్పేస్  , హెచ్ఏఎల్ మధ్య ఒప్పందం కుదిరింది.

భారత దేశ రక్షణ ఎగుమతులు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ. 15,902 కోట్లు సాధించినట్టుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.దేశీయంగా తయారు చేసిన  యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షో లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  తేజస్ యుద్ధ విమానం పనితీరు  సామర్ధ్యాలు పలువురిని ఆకర్షించాయి.

తేజస్ సింగ్ సీట్, సింగి జెట్ ఇంజన్, మల్టీ రోల్ లైట్ ఫైటర్ ఏరోబాటిక్ విన్యాసాలు   వైమానిక పరిశ్రమ నిపుణుల నుండి ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే.క్లిష్టమైన వైమానిక విన్యాసాలను కూడ తేజస్ యుద్ధ విమానం అమలు చేసే సామర్థ్యం ఉంది. ఈ విమానం  అధునాతన  ఏవియానిక్స్ ను కలిగి ఉంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రాడార్ సిస్టం, ఇంటిగ్రేటేడ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ సహా కచ్చితత్వ గైడెడ్ ఆయుధాలు ఈ జెట్ ఫైటర్ లో ఉన్నాయి.