Amit Shah.... కేటీఆర్ ను సీఎం చేయడంపైనే కేసీఆర్ ధ్యాస: కొల్లాపూర్ సభలో అమిత్ షా

రెండు రోజులుగా  తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో  కేసీఆర్ , రాహుల్ పై  అమిత్ షా విమర్శలు గుప్పించారు.

Union Minister Amit Shah Serious Comments on KCR in Kolhapur BJP Vijayasakalp Sabha lns

కొల్లాపూర్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చంద్రయాన్ -3 ను విజయవంతం చేశారని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. గత పదేళ్లుగా  రాహుల్ యాన్ ను చేపట్టినా, ఆయన విఫలమయ్యాడని  అమిత్ షా ఎద్దేవా చేశారు. రాహుల్ యాన్ ను 20 సార్లు ప్రయోగించినా విజయవంతం కాలేదన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి  విమర్శలు గుప్పించారు. 

కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా శనివారం నాడు  నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  నిర్వహించిన భారతీయ జనతా పార్టీ  సకల జనుల విజయ సంకల్ప సభలో  పాల్గొన్నారు.

వాల్మీకి, బోయలను తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు.  కానీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకి, బోయలకు న్యాయం  చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎస్ సీ వర్గీకరణ విషయమై  త్వరలో నిర్ణయం తీసుకుంటానమి  కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు  నిర్వాసితులకు  కేసీఆర్ ఏమీ చేయలేదన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే  నిర్వాసితులకు పరిహారం అందిస్తామని  అమిత్ షా హామీ ఇచ్చారు గుండుమళ్ల ప్రాజెక్టును  అమలు చేస్తామన్నారు.

also read:Amit Shah...ఎస్సీ వర్గీకరణ వేగవంతానికే కమిటీ: అమిత్ షా

మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని  అమిత్ షా చెప్పారు. యువతపై కేసీఆర్ కు ప్రేమ లేదని ఆయన  విమర్శించారు. కేటీఆర్ ను సీఎం చేయడంపైనే  కేసీఆర్ ధ్యాసంతా ఉందని  అమిత్ షా పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం  2.50 లక్షల మందికి  ఉద్యోగాలను ఇచ్చిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

 

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటు వేయడమంటే  అవినీతిపరులకు ఓటు వేయడమని  అమిత్ షా చెప్పారు.కాంగ్రెస్ తరపున ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే  వాళ్లంతా బీఆర్ఎస్ లో చేరారని  అమిత్ షా  ఈ సందర్భంగా గుర్తు చేశారు.కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని  ఆయన ఆరోపించారు.నేటి కాంగ్రెస్ అభ్యర్ధులంతా  నిన్నటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ సర్కార్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు.ఓవైసీ భయంతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదని  అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని  అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను  రద్దు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios