Asianet News TeluguAsianet News Telugu

Narendra Modi...సకల జనుల సౌభాగ్య తెలంగాణ లక్ష్యం: కామారెడ్డి సభలో నరేంద్ర మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు  తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.  ఇవాళ  మధ్యాహ్నం కామారెడ్డిలో నిర్వహించిన  బీజేపీ విజయ సంకల్ప  సభలో  మోడీ ప్రసంగించారు.

KCR Cheated farmers : Prime Minister  Narendra Modi in Kamareddy BJP sabha lns
Author
First Published Nov 25, 2023, 3:08 PM IST

కామారెడ్డి:సకల జనుల సౌభాగ్య తెలంగాణనే తమ పార్టీ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి తెలిపారు.

శనివారంనాడు కామారెడ్డిలో  భారతీయ జనతా పార్టీ  నిర్వహించిన సకల జనుల  విజయ సంకల్ప సభలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రసంగించారు.భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుండి తెలంగాణకు విముక్తి లభించాలని  ప్రధాని కోరారు.9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో  ప్రజలు విసిగి పోయారని ఆయన  చెప్పారు.

also read:Yogi Adityanath..రైతులు, పేదల సంక్షేమం కోసం పాటుపడుతాం: కాగజ్ నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్

  బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్లు, వన్ పెన్షన్, అయోధ్యలో రామమందిరం,370 ఆర్టికల్ వంటి వాగ్దానాలను అమలు చేసినట్టుగా  నరేంద్ర మోడీ గుర్తు చేశారు. పసుపు బోర్డు, గిరిజన  యూనివర్శిటీ హామీలను నిలుపుకున్నామన్నారు. 

ఎస్ సీ వర్గీకరణ కోసం  తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన  చెప్పారు.  తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు.  ఎస్ సీ వర్గీకరణ విషయానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.  బీఆర్ఎస్ పాలన నుండి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.70 ఏళ్ల కాంగ్రెస్  నుండి కూడ ప్రజలు విముక్తి కావాలని భావిస్తున్నారన్నారు.

 

తెలంగాణ ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే  బీసీ సామాజిక వర్గానికి చెందిన  అభ్యర్ధిని సీఎం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.కేంద్ర మంత్రివర్గంలో  బీసీలకు అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.దళితుడిని సీఎం చేస్తానని  హామీ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదని ఆయన  ప్రశ్నించారు.

రైతులను కేసీఆర్ సర్కార్ మోసం చేశారని ఆయన  విమర్శించారు.  ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు.డబ్బులు కావాలంటే  బీఆర్ఎస్ నేతలు కొత్తగా ప్రాజెక్టులు నిర్మిస్తారని  మోడీ విమర్శించారు.రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చిన  విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లో  రూ. 2.75 కోట్లు జమ చేసినట్టుగా  మోడీ  చెప్పారు.పీఎం కిసాన్ సమ్మాన్  ద్వారా 40 లక్షల మంది రాష్ట్ర రైతులు లబ్ది పొందారని మోడీ  గుర్తు చేశారు. రైతులకు  రూ. 300లకే యూరియాను అందిస్తున్నామని  మోడీ చెప్పారు.రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రూ. 15 వేల కోట్లతో పశువులకు ఉచిత వ్యాక్సిన్ వేస్తున్నామని  మోడీ  తెలిపారు.

టీఎస్‌పీఎస్ సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువత మోసపోయిందని నరేంద్ర మోడీ  అభిప్రాయపడ్డారు.అన్ని వర్గాలల  ప్రజల ఆకాంక్షలను బీజేపీ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని ప్రధాని చెప్పారు.తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరాశ, నిస్పృహల్లో ఉన్నందునే  రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఓడించాలని  ఆయన  ప్రజలను కోరారు.పేదలకు ఉచిత రేషన్ ను మరో ఐదేళ్లు ఇవ్వనున్నట్టుగా  ప్రధాన మంత్రి మోడీ హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ హఠాత్తుగా  బీఆర్ఎస్ గా మారింది,  యూపీఏ ఇండియా కూటమిగా మారిన విషయాన్ని  నరేంద్ర మోడీ  ప్రస్తావిస్తూ పేర్లు మార్చుకున్నంత మాత్రాన వీళ్ల బుద్ది మారదని మోడీ  చెప్పారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios