Telangana Exit Polls 2023 లైవ్ అప్ డేట్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

Telangana assembly elections poll 2023 Live Updates AKP

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో వున్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్న దానిపై జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. 

9:56 PM IST

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ ప్రస్తుతం అధికారంలో వుంది. గత ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలను గెలుచుకోగా.. ఈసారి మాత్రం ఈ సంఖ్య 18కి పరిమితమవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ క్రితంసారి మాదిరిగానే 5 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక్కడ అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మరోసారి విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనా వేయగా.. జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం)దే గెలుపని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 

మిజోరంలో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

ఏబీపీ సీ ఓటర్ : ఎంఎన్ఎఫ్ 15 - 21 , జెడ్‌పీఎం 12 - 18, కాంగ్రెస్ 2 - 8
జన్‌కీ బాత్ : ఎంఎన్ఎఫ్ 10 - 14, జెడ్‌పీఎం 15 - 25, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 5 - 9
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ : ఎంఎన్ఎఫ్ 14 -18, జె‌డ్‌పీఎం 12 - 16, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 8 - 10 
పీపుల్స్ పల్స్ సర్వే : ఎంఎన్ఎఫ్ 16 -20, జెడ్‌పీఎం 10 - 14, బీజేపీ 6 - 10, కాంగ్రెస్ 2 - 3
టైమ్స్‌నౌ ఈటీజీ : ఎంఎన్ఎఫ్ 14 - 18, జెడ్‌పీఎం 10 - 14, ఇతరులు 9 - 15

ALso Read: Mizoram Exit polls 2023 : మిజోరంలో మళ్లీ ఎంఎన్ఎఫ్‌దే అధికారం .. బీజేపీ, కాంగ్రెస్‌లకు నిరాశే

8:31 PM IST

మధ్యప్రదేశ్‌లో విజయం ఎవరిది.. క్లారిటీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలవాల్సి వుంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి విజయం దక్కుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుందని అన్ని సర్వేలు తెలిపాయి. కొన్నింటిలో కాంగ్రెస్, మరికొన్నింటిలో బీజేపీకే అధికారమని తేలింది. నవంబర్ 17న ఒకే దశలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 

మధ్యప్రదేశ్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

పీపుల్స్ పల్స్ :  బీజేపీ 91 - 113, కాంగ్రెస్ 117 - 139, ఇతరులు 0 - 8
దైనిక్ భాస్కర్ :  బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 105 - 120
జన్‌కీ బాత్ :  బీజేపీ 100 - 123, కాంగ్రెస్ 102 - 125, ఇతరులు 0 - 5
మేట్రిజ్ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
రిపబ్లిక్ టీవీ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
పోల్‌స్ట్రాట్ :  బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121
న్యూస్ 18 :  బీజేపీ 112 , కాంగ్రెస్ 113, ఇతరులు 5
సీఎన్ఎన్ :  బీజేపీ 116, కాంగ్రెస్ 111, ఇతరులు 3
న్యూస్24 - టుడేస్ చాణక్య :  బీజేపీ 151, కాంగ్రెస్ 74
ఇండియా టుడే :  బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121 , ఇతరులు 0 - 6
జీ న్యూస్ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2

ALso Read: Madhya Pradesh Exit polls 2023 : బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. విజయం ఎవరిదో చెప్పని ఎగ్జిట్ పోల్స్
 
8:30 PM IST

ఛత్తీస్‌గడ్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!

ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నది.

బఘేల్‌కు మరో టర్మ్?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లలో 68 స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంది. 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వానికి 2018లో కాంగ్రెస్ ఫుల్ స్టాప్ పెట్టింది. భూపేశ్ బఘేల్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కాలంలో భుపేశ్ బఘేల్ ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఓబీసీ ఫేస్‌గా భూపేశ్ బఘేల్ ప్రచారం పొందారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కలిసివచ్చారు. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూపేశ్ బఘేల్ మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నది.

ALso Read: Chhattisgarh Exit Polls: ఛత్తీస్‌గడ్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!
 
7:39 PM IST

రాజస్థాన్ బీజేపీదే

వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో రాజస్థాన్‌లో బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

రాజస్థాన్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

దైనిక్ భాస్కర్ : బీజేపీ 98 - 105, కాంగ్రెస్ 85 - 95
పి-మార్క్య్  : బీజేపీ 105 - 125, కాంగ్రెస్ 69 - 91
టైమ్స్‌నౌ ఈటీజీ : బీజేపీ 100 - 128, కాంగ్రెస్ 56 - 72
టీవీ 9 భారత్ వర్ష్ - పోల్‌స్ట్రాట్ : బీజేపీ 100 - 110, కాంగ్రెస్ 90 - 100
జన్‌కీ బాత్ : బీజేపీ 100 - 122, కాంగ్రెస్ 62 - 85, ఇతరులు 14 - 15
రిపబ్లిక్ టీవీ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 2
న్యూస్ 18 : బీజేపీ 111, కాంగ్రెస్ 74, ఇతరులు 14
న్యూస్ నేషన్ : బీజేపీ 89 - 93, కాంగ్రెస్ 99 - 103, ఇతరులు 5 - 9 
ఇండియా టుడే : బీజేపీ 55 - 72, కాంగ్రెస్ 119 - 141, ఇతరులు 4 - 11
పీపుల్స్ పల్స్ సర్వే : బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 73 - 95, ఇతరులు 8 - 11
ఏబీపీ సీఓటర్ : బీజేపీ 94 - 114, కాంగ్రెస్ 71 - 91

ALso REad: Rajasthan Exit Poll 2023 : సెంటిమెంట్ రిపీట్ .. బీజేపీదే అధికారం, రాజస్థాన్‌లో అన్ని సర్వేలదీ ఒకటే మాట 
 
6:52 PM IST

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ - కాంగ్రెస్ కు 72 స్థానాలు

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీకి  62 నుండి  72 స్థానాలు దక్కే అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది.

కాంగ్రెస్ 62 -72
బీఆర్ఎస్ 35-46
బీజేపీ 03-08
ఎంఐఎం 06-07
ఇతరులు 01-02

ALso Read: Telangana Exit Poll Result 2023: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ లో కాంగ్రెస్ కు 72 స్థానాలు

6:50 PM IST

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్

రేస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు 48 + or -3 , కాంగ్రెస్‌కు 62 + or -5, బీజేపీకి + or -2, ఎంఐఎం 6 + or - 1, ఇతరులు 1 + or -2 స్థానాలు కైవసం చేసుకుంటారని రేస్ సంస్థ అంచనా వేసింది. 

ALso Read: Telangana Exit Polls 2023 - Race Poll Survey : సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్

6:27 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’

రాష్ట్రా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 56 సీట్లను గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ 45 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ అనూహ్యంగా ఒక స్థానం నుంచి పది స్థానాలకు పెరుగుతుంది. ఎంఐఎం పార్టీ 8 సీట్లను గెలుచుకుంటుంది. అంతిమంగా ఈ సంస్థ కూడా తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేసింది.

Also Read: Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’.. పుంజుకున్న బీజేపీ

6:26 PM IST

కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు.. కానీ కింగ్‌మేకర్‌గా బీజేపీ

Jan Ki Baat SURVEY ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ.. బీజేపీ కింగ్ మేకర్‌గా మారే అవకాశాలు వున్నాయని పేర్కొంది.  కాంగ్రెస్‌కు 48 నుంచి 64 స్థానాలు, బీఆర్ఎస్‌కు 40 నుంచి 55 సీట్లు, బీజేపీకి 7 నుంచి 13 సీట్లు, ఎంఐఎంకు 4 నుంచి 7 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది. 

Also Read: Telangana Exit Polls 2023 - Jan Ki Baat : కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు.. కానీ కింగ్‌మేకర్‌గా బీజేపీ

6:25 PM IST

సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ - కాంగ్రెస్ కు 65 స్థానాలు

సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లను కైవసం చేసుకుంటుందని  తెలిపింది.

కాంగ్రెస్- 65
బీఆర్ఎస్ -41
బీజేపీ- 4
ఎంఐఎం -7
 
ALso Read: Telangana Exit Poll Result 2023: సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 65 స్థానాలు

5:53 PM IST

తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ ముందంజ

సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కొత్త రాష్ట్రంలో రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 48 సీట్లతో రెండో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పింది. బీజేపీకి 10 సీట్లు, ఎంఐఎంకు 5 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కాంగ్రెస్ అనూహ్యంగా విజృంభించినా మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ తప్పదని ఈ సర్వే చెప్పింది.

ALso Read: Telangana Exit Polls: తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ విజృంభణ

5:52 PM IST

కాంగ్రెస్ కు 68 స్థానాలు

తెలంగాణలో కాంగ్రెస్  పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని   పోల్ టెండ్ర్స్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే తేల్చి చెప్పింది.  
కాంగ్రెస్ కు 65-68
బీఆర్ఎస్ 35-40
బీజేపీ 7-10
ఇతరులకు 6-9
స్థానాలు దక్కే అవకాశం ఉందని  సర్వే తెలిపింది. 

Also Read: Telangana Exit Poll Result 2023... పోల్ ట్రెండ్స్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ కు 68 స్థానాలు

5:46 PM IST

తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

డిసెంబర్ 3న తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా జాతీయ మీడియా సంస్థలు, పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తున్నాయి. న్యూస్ 18 సంస్థ తను నిర్వహించిన సర్వే ఫలితాలు విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని తేల్చింది. 

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు :

కాంగ్రెస్ - 56
బీఆర్ఎస్ - 48
బీజేపీ - 10
ఎంఐఎం - 5

5:28 PM IST

చివరి నిమిషంలో పోటెత్తిన ఓటర్లు.. లాఠీఛార్జ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో వున్న వారికి ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ తండాలోని పోలింగ్ కేంద్రానికి చివరి నిమిషంలో ఓటర్లు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలైన్‌లలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

5:12 PM IST

చెప్పు చూపించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చెప్పు చూపించడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. 

5:03 PM IST

ముగిసిన పోలింగ్.. క్యూలైన్‌లో భారీగా ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్‌లలో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.  

Also Read: Telangana Assembly Elections 2023:ముగిసిన పోలింగ్, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు

4:52 PM IST

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పీఏపై దాడి

వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్‌లో గురువారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి  పీఏపై  కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ALso Read: Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ

4:50 PM IST

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన బ్రహ్మానందం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం తన భార్య, కుమారుడితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4:45 PM IST

ఓటేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4:34 PM IST

ఓటు వేయండహో.. దండోరాతో ఓటర్లకు పిలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర ప్రయత్నాలు చేసింది. సెలబ్రెటీలతో ప్రచారంతో పాటు టీవీలు, పత్రికల్లో ప్రకటనలతో పాటు సోషల్ మీడియాలో అవగాహన కల్పించింది. కాగా.. ఓ గ్రామంలో ఓటు వేయాలంటూ ఓ వ్యక్తి దండోరా వేస్తూ చెబుతున్న వీడియోను ఈసీ షేర్ చేసింది. 
 
4:29 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నిఖిల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హీరో నిఖిల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను ఇప్పుడే ఓటేశానని.. మీరు కూడా ఓటేయ్యాలని, కొంచెం సమయం మాత్రమే వుందని ఆయన ట్వీట్ చేశారు. 

4:26 PM IST

ఎన్నికల విధుల్లో ఉద్యోగిగి గుండెపోటు.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే

చెదురు మదురు ఘటనలు మినహాయిస్తే ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతున్నది. అయితే, సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగికి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే మరణించాడు.

ALso Read: Telangana Elections: ఎన్నికల బాధ్యతల్లో ఉన్న అధికారికి గుండెపోటు, మృతి

4:25 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న అనసూయ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీనటి అనసూయ భరద్వాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన బాధ్యతను పూర్తి చేశానని మీరు ఓటు వేశారా అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. 

4:20 PM IST

గన్‌మెన్‌తో వచ్చి ఓటేసిన బర్రెలక్క

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలోని 12వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు ఈసీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

4:10 PM IST

అగ్రనేతల ఇలాఖాల్లో భారీ పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ అగ్రనేతల ఇలాఖాల్లో మాత్రం పోలింగ్ భారీగా జరుగుతోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి బరిలో వున్న కామారెడ్డిలో 34 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్, ఈటల పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 42 శాతం పోలింగ్ జరిగింది. ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజురాబాద్‌లో 41 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌లో 43 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. 
 
4:02 PM IST

13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని  సమస్యాత్మక  ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట,భద్రాచలం నియోజకవర్గాల్లో ఇవాళ నాలుగు గంటలకే  పోలింగ్ ముగిసింది

Also Read: Telangana Assembly elections 2023: తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

3:54 PM IST

నమ్రతతో కలిసి ఓటు వేసిన మహేష్‌ బాబు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

3:44 PM IST

పాలేరులో ఓటేయని తమ్మినేని వీరభద్రం

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్ధిగా బరిలోకి దిగిన  తమ్మినేని వీరభద్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాంకేతిక కారణాలతో  తమ్మినేని వీరభద్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
Also Read: Tammineni Veerabhadram:పాలేరులో ఓటేయని సీపీఐ(ఎం) అభ్యర్ధి తమ్మినేని వీరభద్రం

3:40 PM IST

3 గంటల వరకు 52 శాతం పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదవ్వగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు కోటి 60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
3:25 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ పోతినేని

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీనటుడు రామ్ పోతినేని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

3:15 PM IST

ఆలేరు : కొలనుపాకలో ఉద్రిక్తత

ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది . కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 
 
3:13 PM IST

రేవంత్‌ను చూసి కేసీఆర్ జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్ధి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనను చూడగానే అక్కడ వున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 

3:05 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న బాబూమోహన్

సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ కార్యాలయంలో బీజేపీ అభ్యర్ధి , సినీనటుడు బాబూమోహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందోల్‌లో విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంపిణీ చేశారని ఆరోపించారు. తాను గెలిస్తే అందోల్ ప్రజలు తన పక్షానే వున్నట్లని , మద్యం, డబ్బుతో గెలిచే వ్యక్తులు తనతో సరితూగరని బాబూమోహన్ అన్నారు. 

2:56 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామ్‌నగర్‌లోని వీజే హైస్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. 

2:45 PM IST

మంచిర్యాల : వివేక్ కుమారుడిని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, ఘర్షణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. 163వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి కుమారుడు ఏజెంట్ పాస్‌తో పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోయాడు. దీనిని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు వివేక్ కుమారుడిని అడ్డుకున్నారు. లోపలికి ఎలా అనుమతి ఇచ్చారంటూ పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.

2:38 PM IST

ఎంత బిజీగా వున్నా సరే .. వెళ్లి ఓటేయ్యండి : స్మితా సభర్వాల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎంవో అధికారిణి, సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంత బిజిగా వున్నప్పటికీ .. వెళ్లి ఓటు వేయాలని, ఇంకా కొద్ది సమయం మాత్రమే వుందని స్మిత ట్వీట్ చేశారు. 

2:34 PM IST

ఓటు హక్కు వినియోగించుకుంటున్న దివ్యాంగులు

పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవిస్తే విహార యాత్రలు చేస్తూ, రెస్ట్ తీసుకుంటూ కాలం గడుపుతున్నారు నగరవాసులు. అలాంటిది అంగవైకల్యంతో బాధపడుతున్నా.. ఎంతో శ్రమకోర్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దివ్యాంగులు. 

2:26 PM IST

పార్టీ కండువాతో ఓటు : ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు

నిర్మల్  అసెంబ్లీ కేంద్రం నుండి బరిలో దిగిన  తెలంగాణ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై  కేసు నమోదు చేశారు. పార్టీ కండువాతో  పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డిపై  కేసు నమోదు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   ఎల్లపెల్లిలో తన  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ALso Read: A. Indra Karan Reddy...పార్టీ కండువాతో ఓటు: ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు

2:23 PM IST

ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి.. నిన్ను చూసైనా వాళ్లకు సిగ్గొస్తుందేమో

పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవిస్తే విహార యాత్రలు చేస్తూ, రెస్ట్ తీసుకుంటూ కాలం గడుపుతున్నారు నగరవాసులు. అలాంటిది ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌తో ఓటు వేయడానికి వచ్చాడో పెద్దాయన.

హైదరాబాదులోని గచ్చిబౌలికి చెందిన శేషయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి.. లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ తోనే ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జిపిఆర్ఏ క్వార్టర్స్ పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ALso Read: Telangana polling : ఆక్సీజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి.. యువతకు ఆదర్శం ఈ పెద్దాయన... 

2:13 PM IST

కవిత, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులందాయి : వికాస్‌రాజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులుఅందాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రతి ఫిర్యాదుపై  జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ)ను రిపోర్టు అడిగినట్టుగా  వికాస్ రాజ్ చెప్పారు.  రిపోర్టులో  కోడ్ ఉల్లంఘించారని తేలితే  డీఈఓపై చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు

Also Read: కవిత, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులందాయి: తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్

2:04 PM IST

సిబ్బంది తప్పుకు ఏకంగా పోలింగే నిలిచిపోయింది...

వికారాబాద్ జిల్లా తాండూరులో పోలింగ్ సిబ్బంది తప్పుకు ఏకంగా పోలింగే నిలిచిపోయింది. పెద్దుముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మిషన్ ను తప్పుగా పెట్టారట. ఇది గుర్తించిన గ్రామస్తులు పోలింగ్ ను అడ్డుకున్నారు. 

1:48 PM IST

హైదరబాదీలు కదలట్లేదుగా... ఇప్పటికీ అత్యల్ప ఓటింగ్ ఇక్కడే

హైదరాబాద్ లో పోలింగ్ మందకోడిగా సాగుతున్నట్లు పోలింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ లో 21 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయితే హైదరాబాద్ లో మాత్రం ఇంకా 20 శాతం చుట్టే వుంది. 
 
1:41 PM IST

ఓటేసిన ఉత్తమ్ పద్మావతి దంపతులు

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

1:36 PM IST

మేము ఓటేసాం... మరి మీరు..: ఓటర్లకు ట్రాన్స్ జెండర్ల విజ్ఞప్తి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కను వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు అందరూ ఓటేయాలని  విజ్ఞప్తి చేసారు. 

1:31 PM IST

తుంగతుర్తిలో అత్యధికంగా 52 శాతం పోలింగ్

ఒంటిగంటవరకు అత్యధికంగా తుంగతుర్తిలో 52, మంథనిలో 51, మెదక్  లో 50  శాతం పోలింగ్ నమోదయ్యింది. 

1:24 PM IST

ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్

మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెలంగాణ వ్యాప్తంగా 40 శాతం పోలింగ్ నమోదయినట్లు సమాచారం. 

1:23 PM IST

ఎగ్జిట్ పోల్స్ విడుదలపై ఈసీ క్లారిటీ

ఎగ్జిట్ పోల్స్ పై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఇవాళ సాయంత్రం ఐదున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకు అనుమతినిచ్చింది. ఆయా సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. 

Exit polls 2023 : సాయంత్రం ఐదున్నరకు ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ అనుమతి

1:20 PM IST

ఆ గ్రామంలో ఒక్క ఓటు కూడా పడలేదు...

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ ప్రజలు పోలింగ్ కు దూరంగా వున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎంతమంది నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదని... అందువల్లే ఓట్లు వేయడానికి దూరంగా వున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 

1:00 PM IST

గద్వాలలో ఓటేసిన డికె అరుణ కుటుంబం

గద్వాల పట్టణంలోని 261 బూత్ లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓటేసారు. ఆమె భర్త భరతసింహా రెడ్డి,  కూతురు స్నిగ్దా రెడ్డి కూడా ఓటేసారు.

12:51 PM IST

ఓటుహక్కు వినియోగించుకున్న హరీష్ దంపతులు

సతీసమేతంగాా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేసిన హరీష్ రావు

12:48 PM IST

కేసీఆర్ కూతురు కవితపై ఎఫ్ఐఆర్

ఓటేసిన తర్వాత పోలింగ్ బూత్ వద్దే ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ కు ఓటేయాలని కోరడంపై వివాదం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఈసికి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదయినట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 
 
12:41 PM IST

మధిరలో ఓటేసిన సిఎల్పీ నేత భట్టి

సిఎల్పి నేత భట్టి విక్రమార్క మధిరలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

12:32 PM IST

బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడికి కాంగ్రెస్ యత్నం... నారాయణపేటలో ఉద్రిక్తత

బిఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఎమ్మల్యేపై దాడికి యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. వెంటనే పోలీసులు రంగంప్రవేశం చేసి ఎమ్మెల్యేను సురక్షితంగా అక్కడినుండి పంపించారు. 

12:26 PM IST

హైదరాబాద్ లో అక్కడక్కడ ఉద్రిక్తత

పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ లో అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. మణికొండలోని ఓ పోలింగ్ బూత్ వద్ ఒకరిపై ఒకరు దాడులకు సిద్దపడ్డారు. అలాగే పాతబస్తీలో ఎంఐఎం, ఎంబిటి నేతల మధ్ ఘర్షణ చోటుచేసుకుంది. 
 
12:19 PM IST

ఓటేసిన టాలీవుడ్ హీరోలు, యాంకర్

హీరో నాని, నితిన్,  కల్యాణ్ రామ్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాని అయితే సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఓటేసారు. ప్రముఖ యాంకర్ సుమ కూడా ఓటేసారు.
 
12:10 PM IST

స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ఓటేసారు బిఆర్ఎస్ అధినేత. 

Kalvakuntla chandrashekar Rao:చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

12:09 PM IST

11 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతం

అదిలాబాద్ 30.6
భద్రాద్రి కిత్తగూడెం 22
హన్మకొండ 21.43
హైదరాబాద్ 12.39
జగిత్యాల 22.5
జనగామ 23.25
భూపాలపల్లి 27.80
జోగెలాంబ గద్వాల్ 29.54
కామారెడ్డి 24.70
కరీంనగర్ 20.09
ఖమ్మం 26.03
ఆసిఫాబాద్ 23.68
మహబూబాబాద్ 28.05
మహబూబ్ నగర్ 23.10
మంచిర్యాల 24.38
మెదక్ 30.27
మేడ్చల్ 14.74
ములుగు 25.36
నగర కర్నూల్ 22.19
నల్గొండ 22.74
నారాయణపేట 23.11
నిర్మల్ 25.10
నిజామాబాద్ 21.25
పెద్దపల్లి 26.41
సిరిసిల్ల 22.02
రంగారెడ్డి 16.84
సంగారెడ్డి 21.99
సిద్దిపేట 28.08
సూర్యాపేట 22.58
వికారాబాద్ 23.16
వనపర్తి 24.10
వరంగల్ 18.73
యాదాద్రి 24.29

12:02 PM IST

తెలంగాణవ్యాప్తంగా పండగలా సాగుతున్న పోలింగ్...

అక్కడక్కడా చెదుమదురు ఘటనలు మినహా తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటుహక్కును వినియోగించుకునేందుకు యువత తరలివస్తున్నారు. అలాగే నడవలేని స్థితిలో వున్న వృద్దులు సైతం ఓటేసేందుకు వీల్ చైర్లపై తరలి వస్తున్నారు. ఇక కుటుంబసమేతంగా ఓటేయడానికి వచ్చినవారు పోలింగ్ బూత్ వద్దే ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. 

11:51 AM IST

ఓటేసిన ఈటల, అర్వింద్, లక్ష్మణ్

సీఎం కేసీఆర్ పై గజ్వెల్ తో పాటు సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే బిజెపి ఎంపీ లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ కూడా ఓటేసారు. 

11:46 AM IST

రేవంత్ రెడ్డి సోదరుడిపై ఈసికి పిర్యాదుచేసిన బిఆర్ఎస్

ఓవైపు పోలింగ్ జరుగుతుంటే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కామారెడ్డి ప్రచారం చేస్తున్నాడంటూ బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రేవంత్ సోదరుడిపై బిఆర్ఎస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసారు. 

11:40 AM IST

ఆదిలాబాద్ లో అత్యధికం... హైదరాబాద్ లో అత్యల్ప పోలింగ్

11 గంటల వరకు తెలంగాణవ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 30.64 శాతం పోలింగ్ నమోదయ్యింది.  ఇక అత్యల్పంగా హైదరాబాద్ లో 12.39 శాతం పోలింగ్ నమోదయ్యాయి. 
 
11:36 AM IST

11 గంటల వరకు 21 శాతం పోలింగ్

తెలంగాణలో 11 గంటల వరకు  21 శాతం పోలింగ్ నమోదయ్యింది.  

11:12 AM IST

క్యూలో నిలబడి... ఓటుహక్కును వినియోగించుకున్న అక్కినేని కుటుంబం

అక్కినేని కుటుంబసభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమలతో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లిన నాగచైతన్య ఓటేసారు. 

11:06 AM IST

కామారెడ్డిలో ఉద్రిక్తత... బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ పడ్డారు. 

10:58 AM IST

ఆదర్శ ఓటర్లు... సత్కరించిన ఎన్నికల సిబ్బంది

నడవలేని పరిస్థితిలో వుండికూడా ఓటుహక్కు వినియోగించుకోడానికి వీల్ చైర్లపై, సహాయకులతో వచ్చిన ఓటర్లను ఎన్నికల అధికారులు అభినందించారు. ఇలా హన్మకొండలో వివిధ పోలింగ్ స్టేషన్లకు వచ్చినవారిని ఎన్నికల అధికారులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. 

10:52 AM IST

ఓటేసిన హీరో సుధీర్ బాబు

హీరో సుధీర్ బాబు కూడా భార్యతో కలిసివెళ్లి దర్గాలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఓటేసారు. 

10:51 AM IST

ఓటేసిన దగ్గుబాటి హీరోలు

దగ్గుబాటి కుటుంంబానికి చెందిన హీరోలు వెంకటేశ్, రానా ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

10:44 AM IST

ఓటేసిన బండి సంజయ్

కరీంనగర్ సాధన స్కూల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటంబసమేతంగా వచ్చి ఓట‌ేసారు సంజయ్. 

Read More  Bandi sanjay...జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు: కరీంనగర్ లో ఓటేసిన బండి సంజయ్

10:39 AM IST

హైదరబాద్ అత్యల్ప ఓటింగ్... తొలి రెండుగంటల్లో కేవలం 4.57 శాతమే

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో ఓటహక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించడంలేదు. దీంతో తొలి రెండు గంటల్లో అంటే 9 గంటల వరకు కేవలం 4.57 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 

Polling in Hyderabad : హైదరాబాదులో ఎప్పటిలాగే అతి తక్కువ పోలింగ్

10:37 AM IST

ఓటుహక్కు వినియోగించుకున్న హరీష్ రావు

సిద్దిపేట అంబిటస్ స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి వచ్చి ఓటేసారు హరీష్. 
 
10:33 AM IST

ఓటేసిన తెలంగాణ సిఈవో వికాస్ రాజ్.

కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సనత్ నగర్ నారాయణ కాలేజ్ పోలింగ్ బూత్ కు వచ్చారు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు.  

10:30 AM IST

జనగామలో ఉద్రిక్తత... టిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల తోపులాట

జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని  పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ లో ఎక్కువగా వుంటుండటంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

telangana elections Polling 2023 : జనగామలో పోలింగ్ బూతు దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ తోపులాట, ఉద్రిక్తత..

10:26 AM IST

ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు...

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేసింది

telangana elections Polling 2023 : ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు...

10:24 AM IST

ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఓటు పడని పోలింగ్ కేంద్రమిదే...

బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌రిపేట‌లో భిన్న‌మైన ప‌రిస్థితి ఉంది. ఓటు వేసేందుకు ఒక్కరు  ముందుకు రాకపోవడంతో ఈ పోలింగ్ కేంద్రం ఖాళీగా క‌నిపిస్తోంది.

Telangana elections 2023: ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం.. !

10:21 AM IST

ఓటేసిన రాజమౌళి...

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓటుహక్కును వినియోగించుకున్నారు. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి భార్య రమతో కలిసివెళ్లి ఓటేసారు. 

10:01 AM IST

ఓటేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి

మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

Asaduddin Owaisi:హైద్రాబాద్ సెయింట్ ఫయా‌జ్ స్కూల్లో ఓటేసిన ఎంఐఎం చీఫ్ అసద్

9:55 AM IST

సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి కేటీఆర్... ఓటేసిన కేసీఆర్ కొడుకు కోడలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీసమేతంగా  పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లో కేటీఆర్ దంపతులు ఓటేసారు. 

K. Taraka Rama Rao...ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి: బంజారాహిల్స్‌లో ఓటేసిన కేటీఆర్

9:50 AM IST

తెలంగాణలో ఇప్పటివరకు 8.38 శాతం పోలింగ్

తెలంగాణలో ఉదయం 9 గంటలకు 8.38 శాతంగా పోలింగ్ నమోదయ్యింది. 
 
9:48 AM IST

ఖమ్మంలో 11 శాతం పోలింగ్

ఖమ్మంలో ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదయ్యింది.

9:44 AM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాతం పోలింగ్ నమోదు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా అందోల్ నియోజకర్గంలో 14 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక మెదక్ లో 9 శాతం, దుబ్బాకలో 10 శాతం, నర్సాపూర్ లో 9 శాతం, గజ్వెల్ లో 10 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. 
 
9:36 AM IST

ఓటేసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి కొండగల్ జడ్పి బాయ్స్ స్కూల్ పోలింగ్ బూత్ కు చేరుకున్న రేవంత్ ఓటేసారు. 

9:27 AM IST

ఓటుహక్కును వినియోగించుకున్న రసమయి

కరీంనగర్ జిల్లా అలుగునూర్ లోని పోలింగ్ స్టేషన్ లో   బిఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 
9:25 AM IST

సూర్యాపేటలో ఉద్రిక్తత...

సూర్యాపేట మఠంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటేసేందుకు వెళ్లిన వ్యక్తిని బిఆర్ఎస్ నేతలు చితకబాదారు. కాంగ్రెస్ వాళ్లు ఓటుసేందుకు వస్తే చంపేస్తామని బిఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

9:22 AM IST

బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ... పోలీసుల లాఠీ చార్జ్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్  లో కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

9:15 AM IST

ఓటేసిన వికాస్ రావు దంపతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు ఆయన తనయుడు, వేములవాడ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

9:12 AM IST

ఓటేసిన సినీ ప్రముఖులు....

సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కుటుంబంతో సహా ఓటుహక్కును వినియోగించుుకున్నారు. 

 telangana election poll : ఓటు వేసిన చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్.. సినీ ప్రముఖులు..

9:07 AM IST

ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలి : చిరంజీవి

జూబ్లీ క్లబ్ లో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య సురేఖ, కూతురు శ్రీజ తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన చిరంజీవి ఓటేసారు. అందరూ బాధ్యతతో ఓటు వేయాలని చిరంజీవి సూచించారు. 

8:48 AM IST

ఎట్టకేలకు ఓటేసిన అల్లుఅర్జున్

ఈవిఎం మొరాయించడంతో చాలాసేపు క్యూలైన్ లో వేచిచూసిన తర్వాత అల్లుఅర్జున్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

8:44 AM IST

ఓటేసిన మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి బోయినిపల్లిలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

8:36 AM IST

ఓటేసేందుకు ఈమె కదిలింది... మీరు కూడా కదలాలి

ఓ వృద్దురాలు నడవలేని పరిస్థితిలో వుండికూడా వీల్ చైర్ లో వచ్చిమరీ ఓటేహక్కును వినియోగించుకున్నారు. ఇలాంటివారిని చూసి అయినా ఓటు వేసేందుకు ప్రతిఒక్కరు కదలాలి.   

8:32 AM IST

ఓటు వెయ్... ఫోటో తియ్...

ఖమ్మం జిల్లాలో  పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయమే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు.  ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద ఫోటోలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 

8:24 AM IST

గ్యాస్ సిలిండర్ కు దండంపెట్టి... ఓటేసేందుకు వెళ్లిన పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్ కు దండంపెట్టి ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. 

8:18 AM IST

ఓటేసిన కీరవాణి కుటుంబం

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబం ఓటుహక్కను వినియోగించుకుంది. 

8:14 AM IST

సతీసమేతంగా వచ్చి ఓటేసిన చిరంజీవి...

జూబ్లీ క్లబ్ పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య సురేఖ కూడా ఓటేసారు. 

8:08 AM IST

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు...

తెలంగాణలో ఉదయమే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. 

8:06 AM IST

ఈవిఎంల మొరాయింపు... పలు కేంద్రాల్లో ప్రారంభంకాని పోలింగ్

తెలంగాణవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివవరకు పోలింగ్ ప్రారంభంకాలేదు. స్టేషన్ ఘనపూర్ బాలికల స్కూల్, గద్వాల జిల్ా  ఏఎల్డి డిగ్రీ కాలేజీ పోలింగ్ కేంద్రం,  కొండగల్ లో ఓ పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 

7:57 AM IST

అంబర్ పేటలో ఓటేసిన కిషన్ రెడ్డి

అంబర్ పేట బర్కత్ పురా పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:47 AM IST

ఓటేసిన ప్రకాష్ రాజ్

షాద్  నగర్ లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటుహక్కను వినియోగించుకున్నారు. 

9:56 PM IST:

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ ప్రస్తుతం అధికారంలో వుంది. గత ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలను గెలుచుకోగా.. ఈసారి మాత్రం ఈ సంఖ్య 18కి పరిమితమవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ క్రితంసారి మాదిరిగానే 5 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక్కడ అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మరోసారి విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనా వేయగా.. జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం)దే గెలుపని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 

మిజోరంలో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

ఏబీపీ సీ ఓటర్ : ఎంఎన్ఎఫ్ 15 - 21 , జెడ్‌పీఎం 12 - 18, కాంగ్రెస్ 2 - 8
జన్‌కీ బాత్ : ఎంఎన్ఎఫ్ 10 - 14, జెడ్‌పీఎం 15 - 25, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 5 - 9
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ : ఎంఎన్ఎఫ్ 14 -18, జె‌డ్‌పీఎం 12 - 16, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 8 - 10 
పీపుల్స్ పల్స్ సర్వే : ఎంఎన్ఎఫ్ 16 -20, జెడ్‌పీఎం 10 - 14, బీజేపీ 6 - 10, కాంగ్రెస్ 2 - 3
టైమ్స్‌నౌ ఈటీజీ : ఎంఎన్ఎఫ్ 14 - 18, జెడ్‌పీఎం 10 - 14, ఇతరులు 9 - 15

ALso Read: Mizoram Exit polls 2023 : మిజోరంలో మళ్లీ ఎంఎన్ఎఫ్‌దే అధికారం .. బీజేపీ, కాంగ్రెస్‌లకు నిరాశే

8:31 PM IST:

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలవాల్సి వుంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి విజయం దక్కుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుందని అన్ని సర్వేలు తెలిపాయి. కొన్నింటిలో కాంగ్రెస్, మరికొన్నింటిలో బీజేపీకే అధికారమని తేలింది. నవంబర్ 17న ఒకే దశలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 

మధ్యప్రదేశ్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

పీపుల్స్ పల్స్ :  బీజేపీ 91 - 113, కాంగ్రెస్ 117 - 139, ఇతరులు 0 - 8
దైనిక్ భాస్కర్ :  బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 105 - 120
జన్‌కీ బాత్ :  బీజేపీ 100 - 123, కాంగ్రెస్ 102 - 125, ఇతరులు 0 - 5
మేట్రిజ్ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
రిపబ్లిక్ టీవీ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
పోల్‌స్ట్రాట్ :  బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121
న్యూస్ 18 :  బీజేపీ 112 , కాంగ్రెస్ 113, ఇతరులు 5
సీఎన్ఎన్ :  బీజేపీ 116, కాంగ్రెస్ 111, ఇతరులు 3
న్యూస్24 - టుడేస్ చాణక్య :  బీజేపీ 151, కాంగ్రెస్ 74
ఇండియా టుడే :  బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121 , ఇతరులు 0 - 6
జీ న్యూస్ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2

ALso Read: Madhya Pradesh Exit polls 2023 : బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. విజయం ఎవరిదో చెప్పని ఎగ్జిట్ పోల్స్
 
8:30 PM IST:

ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నది.

బఘేల్‌కు మరో టర్మ్?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లలో 68 స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంది. 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వానికి 2018లో కాంగ్రెస్ ఫుల్ స్టాప్ పెట్టింది. భూపేశ్ బఘేల్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కాలంలో భుపేశ్ బఘేల్ ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఓబీసీ ఫేస్‌గా భూపేశ్ బఘేల్ ప్రచారం పొందారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కలిసివచ్చారు. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూపేశ్ బఘేల్ మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నది.

ALso Read: Chhattisgarh Exit Polls: ఛత్తీస్‌గడ్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!
 
7:39 PM IST:

వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో రాజస్థాన్‌లో బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

రాజస్థాన్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

దైనిక్ భాస్కర్ : బీజేపీ 98 - 105, కాంగ్రెస్ 85 - 95
పి-మార్క్య్  : బీజేపీ 105 - 125, కాంగ్రెస్ 69 - 91
టైమ్స్‌నౌ ఈటీజీ : బీజేపీ 100 - 128, కాంగ్రెస్ 56 - 72
టీవీ 9 భారత్ వర్ష్ - పోల్‌స్ట్రాట్ : బీజేపీ 100 - 110, కాంగ్రెస్ 90 - 100
జన్‌కీ బాత్ : బీజేపీ 100 - 122, కాంగ్రెస్ 62 - 85, ఇతరులు 14 - 15
రిపబ్లిక్ టీవీ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 2
న్యూస్ 18 : బీజేపీ 111, కాంగ్రెస్ 74, ఇతరులు 14
న్యూస్ నేషన్ : బీజేపీ 89 - 93, కాంగ్రెస్ 99 - 103, ఇతరులు 5 - 9 
ఇండియా టుడే : బీజేపీ 55 - 72, కాంగ్రెస్ 119 - 141, ఇతరులు 4 - 11
పీపుల్స్ పల్స్ సర్వే : బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 73 - 95, ఇతరులు 8 - 11
ఏబీపీ సీఓటర్ : బీజేపీ 94 - 114, కాంగ్రెస్ 71 - 91

ALso REad: Rajasthan Exit Poll 2023 : సెంటిమెంట్ రిపీట్ .. బీజేపీదే అధికారం, రాజస్థాన్‌లో అన్ని సర్వేలదీ ఒకటే మాట 
 
6:52 PM IST:

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీకి  62 నుండి  72 స్థానాలు దక్కే అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది.

కాంగ్రెస్ 62 -72
బీఆర్ఎస్ 35-46
బీజేపీ 03-08
ఎంఐఎం 06-07
ఇతరులు 01-02

ALso Read: Telangana Exit Poll Result 2023: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ లో కాంగ్రెస్ కు 72 స్థానాలు

6:50 PM IST:

రేస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు 48 + or -3 , కాంగ్రెస్‌కు 62 + or -5, బీజేపీకి + or -2, ఎంఐఎం 6 + or - 1, ఇతరులు 1 + or -2 స్థానాలు కైవసం చేసుకుంటారని రేస్ సంస్థ అంచనా వేసింది. 

ALso Read: Telangana Exit Polls 2023 - Race Poll Survey : సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్

6:27 PM IST:

రాష్ట్రా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 56 సీట్లను గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ 45 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ అనూహ్యంగా ఒక స్థానం నుంచి పది స్థానాలకు పెరుగుతుంది. ఎంఐఎం పార్టీ 8 సీట్లను గెలుచుకుంటుంది. అంతిమంగా ఈ సంస్థ కూడా తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేసింది.

Also Read: Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’.. పుంజుకున్న బీజేపీ

6:26 PM IST:

Jan Ki Baat SURVEY ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ.. బీజేపీ కింగ్ మేకర్‌గా మారే అవకాశాలు వున్నాయని పేర్కొంది.  కాంగ్రెస్‌కు 48 నుంచి 64 స్థానాలు, బీఆర్ఎస్‌కు 40 నుంచి 55 సీట్లు, బీజేపీకి 7 నుంచి 13 సీట్లు, ఎంఐఎంకు 4 నుంచి 7 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది. 

Also Read: Telangana Exit Polls 2023 - Jan Ki Baat : కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు.. కానీ కింగ్‌మేకర్‌గా బీజేపీ

6:25 PM IST:

సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లను కైవసం చేసుకుంటుందని  తెలిపింది.

కాంగ్రెస్- 65
బీఆర్ఎస్ -41
బీజేపీ- 4
ఎంఐఎం -7
 
ALso Read: Telangana Exit Poll Result 2023: సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 65 స్థానాలు

5:53 PM IST:

సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కొత్త రాష్ట్రంలో రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 48 సీట్లతో రెండో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పింది. బీజేపీకి 10 సీట్లు, ఎంఐఎంకు 5 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కాంగ్రెస్ అనూహ్యంగా విజృంభించినా మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ తప్పదని ఈ సర్వే చెప్పింది.

ALso Read: Telangana Exit Polls: తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ విజృంభణ

5:52 PM IST:

తెలంగాణలో కాంగ్రెస్  పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని   పోల్ టెండ్ర్స్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే తేల్చి చెప్పింది.  
కాంగ్రెస్ కు 65-68
బీఆర్ఎస్ 35-40
బీజేపీ 7-10
ఇతరులకు 6-9
స్థానాలు దక్కే అవకాశం ఉందని  సర్వే తెలిపింది. 

Also Read: Telangana Exit Poll Result 2023... పోల్ ట్రెండ్స్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ కు 68 స్థానాలు

5:46 PM IST:

డిసెంబర్ 3న తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా జాతీయ మీడియా సంస్థలు, పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తున్నాయి. న్యూస్ 18 సంస్థ తను నిర్వహించిన సర్వే ఫలితాలు విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని తేల్చింది. 

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు :

కాంగ్రెస్ - 56
బీఆర్ఎస్ - 48
బీజేపీ - 10
ఎంఐఎం - 5

5:28 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో వున్న వారికి ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ తండాలోని పోలింగ్ కేంద్రానికి చివరి నిమిషంలో ఓటర్లు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలైన్‌లలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

5:12 PM IST:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చెప్పు చూపించడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. 

5:03 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్‌లలో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.  

Also Read: Telangana Assembly Elections 2023:ముగిసిన పోలింగ్, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు

4:52 PM IST:

వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్‌లో గురువారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి  పీఏపై  కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ALso Read: Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ

4:52 PM IST:

వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్‌లో గురువారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి  పీఏపై  కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ALso Read: Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ

4:50 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం తన భార్య, కుమారుడితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4:47 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4:34 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర ప్రయత్నాలు చేసింది. సెలబ్రెటీలతో ప్రచారంతో పాటు టీవీలు, పత్రికల్లో ప్రకటనలతో పాటు సోషల్ మీడియాలో అవగాహన కల్పించింది. కాగా.. ఓ గ్రామంలో ఓటు వేయాలంటూ ఓ వ్యక్తి దండోరా వేస్తూ చెబుతున్న వీడియోను ఈసీ షేర్ చేసింది. 
 
4:29 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హీరో నిఖిల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను ఇప్పుడే ఓటేశానని.. మీరు కూడా ఓటేయ్యాలని, కొంచెం సమయం మాత్రమే వుందని ఆయన ట్వీట్ చేశారు. 

4:26 PM IST:

చెదురు మదురు ఘటనలు మినహాయిస్తే ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతున్నది. అయితే, సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగికి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే మరణించాడు.

ALso Read: Telangana Elections: ఎన్నికల బాధ్యతల్లో ఉన్న అధికారికి గుండెపోటు, మృతి

4:24 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీనటి అనసూయ భరద్వాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన బాధ్యతను పూర్తి చేశానని మీరు ఓటు వేశారా అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. 

4:20 PM IST:

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలోని 12వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు ఈసీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

4:10 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ అగ్రనేతల ఇలాఖాల్లో మాత్రం పోలింగ్ భారీగా జరుగుతోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి బరిలో వున్న కామారెడ్డిలో 34 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్, ఈటల పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 42 శాతం పోలింగ్ జరిగింది. ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజురాబాద్‌లో 41 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌లో 43 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. 
 
4:02 PM IST:

తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని  సమస్యాత్మక  ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట,భద్రాచలం నియోజకవర్గాల్లో ఇవాళ నాలుగు గంటలకే  పోలింగ్ ముగిసింది

Also Read: Telangana Assembly elections 2023: తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

3:54 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

3:43 PM IST:

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్ధిగా బరిలోకి దిగిన  తమ్మినేని వీరభద్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాంకేతిక కారణాలతో  తమ్మినేని వీరభద్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
Also Read: Tammineni Veerabhadram:పాలేరులో ఓటేయని సీపీఐ(ఎం) అభ్యర్ధి తమ్మినేని వీరభద్రం

3:40 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదవ్వగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు కోటి 60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
3:25 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీనటుడు రామ్ పోతినేని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

3:15 PM IST:

ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది . కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 
 
4:15 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్ధి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనను చూడగానే అక్కడ వున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 

3:05 PM IST:

సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ కార్యాలయంలో బీజేపీ అభ్యర్ధి , సినీనటుడు బాబూమోహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందోల్‌లో విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంపిణీ చేశారని ఆరోపించారు. తాను గెలిస్తే అందోల్ ప్రజలు తన పక్షానే వున్నట్లని , మద్యం, డబ్బుతో గెలిచే వ్యక్తులు తనతో సరితూగరని బాబూమోహన్ అన్నారు. 

2:56 PM IST:

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామ్‌నగర్‌లోని వీజే హైస్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. 

2:45 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. 163వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి కుమారుడు ఏజెంట్ పాస్‌తో పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోయాడు. దీనిని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు వివేక్ కుమారుడిని అడ్డుకున్నారు. లోపలికి ఎలా అనుమతి ఇచ్చారంటూ పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.

2:38 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎంవో అధికారిణి, సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంత బిజిగా వున్నప్పటికీ .. వెళ్లి ఓటు వేయాలని, ఇంకా కొద్ది సమయం మాత్రమే వుందని స్మిత ట్వీట్ చేశారు. 

2:34 PM IST:

పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవిస్తే విహార యాత్రలు చేస్తూ, రెస్ట్ తీసుకుంటూ కాలం గడుపుతున్నారు నగరవాసులు. అలాంటిది అంగవైకల్యంతో బాధపడుతున్నా.. ఎంతో శ్రమకోర్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దివ్యాంగులు. 

2:26 PM IST:

నిర్మల్  అసెంబ్లీ కేంద్రం నుండి బరిలో దిగిన  తెలంగాణ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై  కేసు నమోదు చేశారు. పార్టీ కండువాతో  పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డిపై  కేసు నమోదు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   ఎల్లపెల్లిలో తన  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ALso Read: A. Indra Karan Reddy...పార్టీ కండువాతో ఓటు: ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు

2:23 PM IST:

పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవిస్తే విహార యాత్రలు చేస్తూ, రెస్ట్ తీసుకుంటూ కాలం గడుపుతున్నారు నగరవాసులు. అలాంటిది ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌తో ఓటు వేయడానికి వచ్చాడో పెద్దాయన.

హైదరాబాదులోని గచ్చిబౌలికి చెందిన శేషయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి.. లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ తోనే ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జిపిఆర్ఏ క్వార్టర్స్ పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ALso Read: Telangana polling : ఆక్సీజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి.. యువతకు ఆదర్శం ఈ పెద్దాయన... 

2:12 PM IST:

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులుఅందాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రతి ఫిర్యాదుపై  జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ)ను రిపోర్టు అడిగినట్టుగా  వికాస్ రాజ్ చెప్పారు.  రిపోర్టులో  కోడ్ ఉల్లంఘించారని తేలితే  డీఈఓపై చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు

Also Read: కవిత, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులందాయి: తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్

2:03 PM IST:

వికారాబాద్ జిల్లా తాండూరులో పోలింగ్ సిబ్బంది తప్పుకు ఏకంగా పోలింగే నిలిచిపోయింది. పెద్దుముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మిషన్ ను తప్పుగా పెట్టారట. ఇది గుర్తించిన గ్రామస్తులు పోలింగ్ ను అడ్డుకున్నారు. 

1:47 PM IST:

హైదరాబాద్ లో పోలింగ్ మందకోడిగా సాగుతున్నట్లు పోలింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ లో 21 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయితే హైదరాబాద్ లో మాత్రం ఇంకా 20 శాతం చుట్టే వుంది. 
 
1:41 PM IST:

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

1:35 PM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కను వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు అందరూ ఓటేయాలని  విజ్ఞప్తి చేసారు. 

1:31 PM IST:

ఒంటిగంటవరకు అత్యధికంగా తుంగతుర్తిలో 52, మంథనిలో 51, మెదక్  లో 50  శాతం పోలింగ్ నమోదయ్యింది. 

1:24 PM IST:

మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెలంగాణ వ్యాప్తంగా 40 శాతం పోలింగ్ నమోదయినట్లు సమాచారం. 

1:23 PM IST:

ఎగ్జిట్ పోల్స్ పై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఇవాళ సాయంత్రం ఐదున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకు అనుమతినిచ్చింది. ఆయా సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. 

Exit polls 2023 : సాయంత్రం ఐదున్నరకు ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ అనుమతి

1:20 PM IST:

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ ప్రజలు పోలింగ్ కు దూరంగా వున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎంతమంది నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదని... అందువల్లే ఓట్లు వేయడానికి దూరంగా వున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 

1:00 PM IST:

గద్వాల పట్టణంలోని 261 బూత్ లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓటేసారు. ఆమె భర్త భరతసింహా రెడ్డి,  కూతురు స్నిగ్దా రెడ్డి కూడా ఓటేసారు.

12:51 PM IST:

సతీసమేతంగాా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేసిన హరీష్ రావు

12:48 PM IST:

ఓటేసిన తర్వాత పోలింగ్ బూత్ వద్దే ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ కు ఓటేయాలని కోరడంపై వివాదం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఈసికి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదయినట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 
 
12:41 PM IST:

సిఎల్పి నేత భట్టి విక్రమార్క మధిరలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

12:32 PM IST:

బిఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఎమ్మల్యేపై దాడికి యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. వెంటనే పోలీసులు రంగంప్రవేశం చేసి ఎమ్మెల్యేను సురక్షితంగా అక్కడినుండి పంపించారు. 

12:26 PM IST:

పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ లో అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. మణికొండలోని ఓ పోలింగ్ బూత్ వద్ ఒకరిపై ఒకరు దాడులకు సిద్దపడ్డారు. అలాగే పాతబస్తీలో ఎంఐఎం, ఎంబిటి నేతల మధ్ ఘర్షణ చోటుచేసుకుంది. 
 
12:26 PM IST:

పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ లో అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. మణికొండలోని ఓ పోలింగ్ బూత్ వద్ ఒకరిపై ఒకరు దాడులకు సిద్దపడ్డారు. అలాగే పాతబస్తీలో ఎంఐఎం, ఎంబిటి నేతల మధ్ ఘర్షణ చోటుచేసుకుంది. 
 
12:19 PM IST:

హీరో నాని, నితిన్,  కల్యాణ్ రామ్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాని అయితే సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఓటేసారు. ప్రముఖ యాంకర్ సుమ కూడా ఓటేసారు.
 
12:15 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ఓటేసారు బిఆర్ఎస్ అధినేత. 

Kalvakuntla chandrashekar Rao:చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

12:09 PM IST:

అదిలాబాద్ 30.6
భద్రాద్రి కిత్తగూడెం 22
హన్మకొండ 21.43
హైదరాబాద్ 12.39
జగిత్యాల 22.5
జనగామ 23.25
భూపాలపల్లి 27.80
జోగెలాంబ గద్వాల్ 29.54
కామారెడ్డి 24.70
కరీంనగర్ 20.09
ఖమ్మం 26.03
ఆసిఫాబాద్ 23.68
మహబూబాబాద్ 28.05
మహబూబ్ నగర్ 23.10
మంచిర్యాల 24.38
మెదక్ 30.27
మేడ్చల్ 14.74
ములుగు 25.36
నగర కర్నూల్ 22.19
నల్గొండ 22.74
నారాయణపేట 23.11
నిర్మల్ 25.10
నిజామాబాద్ 21.25
పెద్దపల్లి 26.41
సిరిసిల్ల 22.02
రంగారెడ్డి 16.84
సంగారెడ్డి 21.99
సిద్దిపేట 28.08
సూర్యాపేట 22.58
వికారాబాద్ 23.16
వనపర్తి 24.10
వరంగల్ 18.73
యాదాద్రి 24.29

12:03 PM IST:

అక్కడక్కడా చెదుమదురు ఘటనలు మినహా తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటుహక్కును వినియోగించుకునేందుకు యువత తరలివస్తున్నారు. అలాగే నడవలేని స్థితిలో వున్న వృద్దులు సైతం ఓటేసేందుకు వీల్ చైర్లపై తరలి వస్తున్నారు. ఇక కుటుంబసమేతంగా ఓటేయడానికి వచ్చినవారు పోలింగ్ బూత్ వద్దే ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. 

11:53 AM IST:

సీఎం కేసీఆర్ పై గజ్వెల్ తో పాటు సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే బిజెపి ఎంపీ లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ కూడా ఓటేసారు. 

11:46 AM IST:

ఓవైపు పోలింగ్ జరుగుతుంటే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కామారెడ్డి ప్రచారం చేస్తున్నాడంటూ బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రేవంత్ సోదరుడిపై బిఆర్ఎస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసారు. 

11:40 AM IST:

11 గంటల వరకు తెలంగాణవ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 30.64 శాతం పోలింగ్ నమోదయ్యింది.  ఇక అత్యల్పంగా హైదరాబాద్ లో 12.39 శాతం పోలింగ్ నమోదయ్యాయి. 
 
11:36 AM IST:

తెలంగాణలో 11 గంటల వరకు  21 శాతం పోలింగ్ నమోదయ్యింది.  

11:13 AM IST:

అక్కినేని కుటుంబసభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమలతో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లిన నాగచైతన్య ఓటేసారు. 

11:07 AM IST:

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ పడ్డారు. 

10:59 AM IST:

నడవలేని పరిస్థితిలో వుండికూడా ఓటుహక్కు వినియోగించుకోడానికి వీల్ చైర్లపై, సహాయకులతో వచ్చిన ఓటర్లను ఎన్నికల అధికారులు అభినందించారు. ఇలా హన్మకొండలో వివిధ పోలింగ్ స్టేషన్లకు వచ్చినవారిని ఎన్నికల అధికారులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. 

10:52 AM IST:

హీరో సుధీర్ బాబు కూడా భార్యతో కలిసివెళ్లి దర్గాలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఓటేసారు. 

10:51 AM IST:

దగ్గుబాటి కుటుంంబానికి చెందిన హీరోలు వెంకటేశ్, రానా ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

11:55 AM IST:

కరీంనగర్ సాధన స్కూల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటంబసమేతంగా వచ్చి ఓట‌ేసారు సంజయ్. 

Read More  Bandi sanjay...జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు: కరీంనగర్ లో ఓటేసిన బండి సంజయ్

11:00 AM IST:

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో ఓటహక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించడంలేదు. దీంతో తొలి రెండు గంటల్లో అంటే 9 గంటల వరకు కేవలం 4.57 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 

Polling in Hyderabad : హైదరాబాదులో ఎప్పటిలాగే అతి తక్కువ పోలింగ్

10:37 AM IST:

సిద్దిపేట అంబిటస్ స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి వచ్చి ఓటేసారు హరీష్. 
 
10:34 AM IST:

కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సనత్ నగర్ నారాయణ కాలేజ్ పోలింగ్ బూత్ కు వచ్చారు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు.  

10:30 AM IST:

జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని  పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ లో ఎక్కువగా వుంటుండటంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

telangana elections Polling 2023 : జనగామలో పోలింగ్ బూతు దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ తోపులాట, ఉద్రిక్తత..

10:26 AM IST:

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేసింది

telangana elections Polling 2023 : ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు...

10:24 AM IST:

బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌రిపేట‌లో భిన్న‌మైన ప‌రిస్థితి ఉంది. ఓటు వేసేందుకు ఒక్కరు  ముందుకు రాకపోవడంతో ఈ పోలింగ్ కేంద్రం ఖాళీగా క‌నిపిస్తోంది.

Telangana elections 2023: ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం.. !

10:21 AM IST:

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓటుహక్కును వినియోగించుకున్నారు. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి భార్య రమతో కలిసివెళ్లి ఓటేసారు. 

12:27 PM IST:

మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

Asaduddin Owaisi:హైద్రాబాద్ సెయింట్ ఫయా‌జ్ స్కూల్లో ఓటేసిన ఎంఐఎం చీఫ్ అసద్

12:13 PM IST:

ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీసమేతంగా  పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లో కేటీఆర్ దంపతులు ఓటేసారు. 

K. Taraka Rama Rao...ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి: బంజారాహిల్స్‌లో ఓటేసిన కేటీఆర్

9:50 AM IST:

తెలంగాణలో ఉదయం 9 గంటలకు 8.38 శాతంగా పోలింగ్ నమోదయ్యింది. 
 
9:48 AM IST:

ఖమ్మంలో ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదయ్యింది.

9:43 AM IST:

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా అందోల్ నియోజకర్గంలో 14 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక మెదక్ లో 9 శాతం, దుబ్బాకలో 10 శాతం, నర్సాపూర్ లో 9 శాతం, గజ్వెల్ లో 10 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. 
 
9:39 AM IST:

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి కొండగల్ జడ్పి బాయ్స్ స్కూల్ పోలింగ్ బూత్ కు చేరుకున్న రేవంత్ ఓటేసారు. 

9:27 AM IST:

కరీంనగర్ జిల్లా అలుగునూర్ లోని పోలింగ్ స్టేషన్ లో   బిఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 
9:25 AM IST:

సూర్యాపేట మఠంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటేసేందుకు వెళ్లిన వ్యక్తిని బిఆర్ఎస్ నేతలు చితకబాదారు. కాంగ్రెస్ వాళ్లు ఓటుసేందుకు వస్తే చంపేస్తామని బిఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

9:22 AM IST:

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్  లో కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

9:18 AM IST:

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు ఆయన తనయుడు, వేములవాడ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

9:12 AM IST:

సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కుటుంబంతో సహా ఓటుహక్కును వినియోగించుుకున్నారు. 

 telangana election poll : ఓటు వేసిన చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్.. సినీ ప్రముఖులు..

9:09 AM IST:

జూబ్లీ క్లబ్ లో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య సురేఖ, కూతురు శ్రీజ తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన చిరంజీవి ఓటేసారు. అందరూ బాధ్యతతో ఓటు వేయాలని చిరంజీవి సూచించారు. 

8:50 AM IST:

ఈవిఎం మొరాయించడంతో చాలాసేపు క్యూలైన్ లో వేచిచూసిన తర్వాత అల్లుఅర్జున్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

8:44 AM IST:

మంత్రి మల్లారెడ్డి బోయినిపల్లిలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

8:35 AM IST:

ఓ వృద్దురాలు నడవలేని పరిస్థితిలో వుండికూడా వీల్ చైర్ లో వచ్చిమరీ ఓటేహక్కును వినియోగించుకున్నారు. ఇలాంటివారిని చూసి అయినా ఓటు వేసేందుకు ప్రతిఒక్కరు కదలాలి.   

8:32 AM IST:

ఖమ్మం జిల్లాలో  పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయమే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు.  ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద ఫోటోలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 

8:24 AM IST:

కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్ కు దండంపెట్టి ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. 

8:18 AM IST:

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబం ఓటుహక్కను వినియోగించుకుంది. 

8:38 AM IST:

జూబ్లీ క్లబ్ పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య సురేఖ కూడా ఓటేసారు. 

8:08 AM IST:

తెలంగాణలో ఉదయమే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. 

8:05 AM IST:

తెలంగాణవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివవరకు పోలింగ్ ప్రారంభంకాలేదు. స్టేషన్ ఘనపూర్ బాలికల స్కూల్, గద్వాల జిల్ా  ఏఎల్డి డిగ్రీ కాలేజీ పోలింగ్ కేంద్రం,  కొండగల్ లో ఓ పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 

8:05 AM IST:

తెలంగాణవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివవరకు పోలింగ్ ప్రారంభంకాలేదు. స్టేషన్ ఘనపూర్ బాలికల స్కూల్, గద్వాల జిల్ా  ఏఎల్డి డిగ్రీ కాలేజీ పోలింగ్ కేంద్రం,  కొండగల్ లో ఓ పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 

8:57 AM IST:

అంబర్ పేట బర్కత్ పురా పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:47 AM IST:

షాద్  నగర్ లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటుహక్కను వినియోగించుకున్నారు. 

7:48 AM IST:

సినీ హీరో అల్లు అర్జున్ ఓటేసేందుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలింగ్ స్టేషన్ ఈవిఎం మొరాయించింది. దీంతో ఓటేసేందుకు అల్లు అర్జున్ క్యూలోనే ఎదురుచూడాల్సి వస్తోంది. 

7:39 AM IST:

ఖమ్మం జిల్లా నారాయణపురంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:32 AM IST:

ఈవిఎంలు మొరాయించడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభంకాలేదు. ఇలా అమీన్ పూర్, సనత్ నగర్ లో ఈవిఎంలు మొరాయించడంతో కొత్తవి ఏర్పాటుచేసేందుకు ఈసి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
 
7:36 AM IST:

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తల్లి, భార్యతో కలిసి క్యూలో నిలబడి వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు జూ. ఎన్టీఆర్.

7:24 AM IST:

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

12:12 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:15 AM IST:

మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మొరాయించడంతో పోలింగ్ ప్రారంభంకాలేదు.  
 
7:12 AM IST:

కూకట్ పల్లి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:06 AM IST:

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. 

7:01 AM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే పోలింగ్ కోసం అన్నీ సిద్దంచేసిన ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.  

6:55 AM IST:

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల మద్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే ఇది ఎన్నికల వేళ మరోసారి సెంటిమెంట్స్ రగిల్చేందుకు కేసీఆర్ ఆడుతున్న నాటకమని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.  

Breaking news : నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు..

6:50 AM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుహక్కును వినియోగించుకునేందుకు సతీసమేతంగా స్వగ్రామం చింతమడకకు బయలుదేరారు. పోలింగ్ ప్రారంభం కాగానే అంటే 7.30 గంటలకు కేసీఆర్ దంపతులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 

6:41 AM IST:

తెలంగాణ  ఎన్నికల పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే పలువురు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేని వారికి హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది ఈసి. దీంతో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని పలువురు ఇప్పటికే ఓటేసారు.  

6:36 AM IST:

తెలంగాణవ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు వున్నారు. వీరిలో దాదాపు 17 లక్షల మంది కొత్త ఓటర్లున్నారు. వీరంతా మొదటిసారిగా ఇవాళ  తమ ఓటుుహక్కును వినియోగించుకోనున్నారు. 

New Voters: మొదటి సారి ఓటు వేస్తున్నారా? అయితే.. ఈ రూల్స్ తప్పనిసరి తెలుసుకోవాల్సిందే !

6:29 AM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమీషన్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. కేవలం మహిళలే ఎన్నికల సిబ్బందిగా కొన్ని,  మోడల పోలింగ్ స్టేషన్లుగా మరికొన్నింటిని ఏర్పాటుచేసారు. 

6:17 AM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగనుంది.  

Telangana Elections: ఆ నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ క్లోజ్..
 
6:12 AM IST:

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కీలక నాయకులు కూడా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడ ఓటేయనున్నారో తెలుసుకోండి.

Telangana Elections 2023: తెలంగాణ ప్రముఖ నేతలు ఎవరెవరు..ఎక్కడెక్కడ ఓటు వేయనున్నరంటే..?

6:06 AM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అన్నిపార్టీలు, అభ్యర్థుల తరపున పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నవారి సమక్షంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. 

5:55 AM IST:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక సమరానికి రంగం సిద్దమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నేడు ప్రజలంతా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమీషన్ అన్నిఏర్పట్లు చేసింది. మరికొద్దిసేపట్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.  