సారాంశం

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకొనే అవకాశం ఉందని   పోల్ ట్రెండ్స్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.


హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్  పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని   పోల్ టెండ్ర్స్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే తేల్చి చెప్పింది.  
కాంగ్రెస్ కు 65-68
బీఆర్ఎస్ 35-40
బీజేపీ 7-10
ఇతరులకు 6-9
స్థానాలు దక్కే అవకాశం ఉందని  సర్వే తెలిపింది. 

తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని  భారత రాష్ట్ర సమితి  ప్రయత్నిస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  వ్యూహత్మకంగా ముందుకు వెళ్లింది. దక్షిణాదిలో తెలంగాణలో  అధికారాన్ని  దక్కించుకోవాలని  కమలదళం అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రంపై   బీజేపీ జాతీయ నాయకత్వం కూడ  ఫోకస్ పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలు కూడ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

తెలంగాణ రాష్ట్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.  బీఆర్ఎస్  119 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ  118 స్థానాల్లో తన అభ్యర్ధులను పోటీకి దింపింది.  ఒక్క స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని  సీపీఐకి కేటాయించింది.